ప్రతిభను గుర్తించడంతో పాటు ప్రోత్సాహించడంలో కూడా ముందుంటారు వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా. అంతేకాక సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టీవ్‌గా ఉంటారు. స్ఫూర్తిదాయక, ఆసక్తికర అంశాలను తన ట్విటర్‌లో షేర్ చేస్తుంటారు. తాజాగా మరో సారి మరో వినూత్న ఆవిష్కరణ గురించి ప్రపంచానికి తన ట్విటర్ ద్వారా తెలియజేశారు ఆనంద్ మహీంద్రా.
చదవండి: అతన్ని చూసి రోబో కూడా అసూయపడుతుంది-అబ్బురపడిన ఆనంద్ మహీంద్రా
కుమారుడి కోసం ఓ తండ్రి పనికి రాని వస్తువులతో చిన్నపాటి జీప్‌ను తయారు చేస్తాడు. ఇది కాస్త ఆనంద్ మహీంద్రా దృష్టి లో పడింది. ఈ క్రమంలో ఆయన సదరు వ్యక్తిని అభినందించడమే కాక.. అతడు తయారు చేసిన జీప్ ను తనకు ఇస్తే.. బదులుగా అతడికి తన కంపెనీ బొలెరోని ఇస్తానని తెలిపారు. ప్రస్తుతం ఈ ట్వీట్ తెగ వైరలవుతోంది. ఆ వివరాలు..
మహారాష్ట్ర దేవ్ రాష్ట్రే కు చెందిన దత్తాత్రేయ లోహార్ అనే వ్యక్తి పెద్దగా చదువుకోలేదు. కమ్మరి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తుండేవాడు. ఈ క్రమంలో కుమారుడి కోసం పనికి రాని తుక్కు మెటిరీయల్ తో చిన్న జీప్ ను తయారు చేస్తాడు. కేవలం 60 వేల రూపాయాల ఖర్చుతో ఈ వాహనాన్ని రూపొందించాడు. టూ వీలర్స్‌లో ఉండే కిక్ స్టార్ట్ మెకానిజంతో ఈ జీప్ పని చేస్తుంది.
Local authorities will sooner or later stop him from plying the vehicle since it flouts regulations. I’ll personally offer him a Bolero in exchange. His creation can be displayed at MahindraResearchValley to inspire us, since ‘resourcefulness’ means doing more with less resources https://t.co/mibZTGjMPp
— anand mahindra (@anandmahindra) December 22, 2021
ఈ కార్ ఎలా పని చేస్తుందో వివరిస్తూ.. లోహార్ ఓ వీడియోని రూపొందించాడు. సోషల్ మీడియాలో పోస్ట్ అయిన ఈ వీడియో కాస్త ఆనంద్ మహీంద్రా దృష్టిలో పడింది. లోహార్ ప్రతిభకు ఆశ్చర్యపోయారు ఆనంద్ మహీంద్ర. అతడి ప్రయత్నాన్ని ప్రశంసించడమే కాక.. తనకు ఆ జీప్ ఇస్తే బదులుగా బొలెరో వాహనాన్ని ఇస్తాను అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.
‘వనరుల సద్వినియోగం అంటే తక్కువ వనరులతో ఎక్కువ తయారు చేయడం. లోహార్ అదే పని చేశారు. ఆయన తయారు చేసిన జీప్ ను మా మహీంద్రా రీసెర్చ్ వ్యాలీలో ప్రదర్శిస్తాం’ అంటూ ట్వీట్ చేశారు. దీన్ని ఇప్పటికే 14 వేల మంది లైక్ చేయగా.. 1300 మంది రీట్వీట్ చేశారు.