2 Feet House: అన్న మీద కోపంతో ఓ తమ్ముడు చరిత్రలో గుర్తుండిపోయే పని చేశాడు. అన్నను దెబ్బతీయాటానికి ఏకంగా రెండు అడుగుల వెడల్పులోనే ఇళ్లు కట్టేశాడు. వివరాల్లోకి వెళితే.. లెబనాన్, బీరట్‌కు చెందిన ఓ అన్నదమ్ములిద్దరికి వారసత్వంగా బీచుగా దగ్గరగా కొంత స్థలం వచ్చింది. ఆ స్థలం రెండు భాగాలుగా ఉంది. ఓ భాగం చక్కగా ఉండగా.. మరో భాగం వంకరగా ఉంది. పెద్దవాడికి మంచి భాగం వచ్చింది. చిన్న వాడికి వంకరగా ఉన్న భాగం వచ్చింది. మంచిగా ఉన్న భాగంలో అన్న ఓ భవనాన్ని కట్టించాడు. అయితే, అన్న కట్టించిన భవనం నుంచి నేరుగా సముద్రం కనిపిస్తుంది.
దీంతో దాని రేటు దినదినాభివృద్ధి చెందుతూ పోసాగింది. అన్న ఆస్తి విలువ పెరుగుతూ పోతోంటే తమ్ముడు చూస్తూ ఉండలేకపోయాడు. అన్నను ఎలాగైనా దిగదార్చాలకున్నాడు. ఇందుకోసం మాస్టర్ ప్లాన్ వేశాడు. అన్న ఇంటి ముందు తనకున్న రెండు అడుగుల వెడల్పు స్థలంలోనే ఇంటిని నిర్మించాడు. అన్ని హంగులను ఆ రెండడుగుల భవనంలోనే సమకూర్చాడు. ఈ ఇళ్లు కనిష్ఠంగా 2 అడుగులు, గరిష్ఠంగా 13 అడుగుల వెడల్పుతో ఉంటుంది.
అన్నపై పగ తీర్చుకోవటానికి 1950లో ఈ ఇంటిని నిర్మించాడు. మొదట్లో ఈ భవనం పడుపు వృత్తి ప్రదేశంగా ఉండేది. ఆ తర్వాత శరణార్థుల నివాసంగా ఉండింది. ప్రస్తుతం ఇందులో ఎవరూ ఉండట్లేదు. కానీ, ఈ భవనం ప్రపంచ వ్యాప్తంగా చాలా ఫేమస్ అయిపోయింది. మొండితనానికి, పగకు ప్రతీకగా నిలిచిపోయింది. మరి, ఈ భవనంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Pakisthan MP: పాకిస్థాన్ ఎంపీ.. మీమ్స్ తో ఇండియాలోనూ ఫేమస్ అయిన ఆమీర్ లియాఖత్ మృతి!