బిజినెస్ డెస్క్- మీరు కారు కొనాలనుకుంటున్నారా.. కరోనా కాలంలో బోలెడంత డబ్బు పెట్టి కారు ఎలా కొనాలని ఆలోచిస్తున్నారా.. ఐతే ప్రముఖ దేశీయ కార్ల తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా మరోసారి తీపి కబురు చెప్పింది. మహీంద్రా కార్లపై భారీ డిస్కౌంట్లు ప్రకింటించిదీ కంపెనీ. రీసెంట్ గా మార్కెట్లోకి లాంచ్ చేసిను థార్ జీప్ మినహా అన్ని మహింద్రా కార్లపై భారీ తగ్గింపు ధరలను ప్రకటించింది. మహింద్రా బీఎస్-6 కార్లను భారీ డిస్కౌంట్ ధరలో వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ అఫర్‌లో అత్యధికంగా 3 లక్షల ఆరు వేల రూపాయల వకు డిస్కౌంట్ లభిస్తోంది. ప్రధానంగా మహీంద్రా అల్టురాస్ జీ 4 ఎస్‌యూవీ కొనుగోలుపై మొత్తం 3.06 లక్షల వరకు తగ్గింపు ఇస్తున్నారు. అంటే కారు ధరలో పది శాతానికి పైగా డిస్కౌంట్ లభిస్తోందన్నమాట.
అంతే కాదు 2 లక్షల 20 వేల రూపాయల వరకు నగదు ఆఫర్, 50 వేల రూపాయల వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్లు సైతం ఉన్నాయి. అవి కాకుండా కార్పొరేట్ ఆఫర్ 16 వేలు, ఇతర ప్రయోజనాలు 20 వేల రూపాయల మేర డిస్కౌంట్ ఇస్తున్నారు. ఇక మహింద్రా కార్లపై ఈ డిస్కౌంట్ రేట్లు ఈ నెల 30 వరకు అందుబాటులో ఉంటాయి. మహింద్రా అధికారిక వెబ్‌సైట్ ప్రకారం ఆయా డీలర్ల పరిధిలో ఈ తగ్గింపులో అక్కడక్కడా మార్పులు ఉండే అవకాశం ఉంది. కొనుగోలుదారులు కెయూవీ 100 ఎన్‌ఎక్స్‌టీ నుండి అల్టురాస్ జీ 4 ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ వరకు పలు మోడళ్ల కార్లపై నగదు ఆఫర్, ఎక్స్ఛేంజ్ బోనస్ , కార్పొరేట్ డిస్కౌంట్ వంటి ప్రయోజనాలను పొందవచ్చు. మరి ఇంకేందుకు ఆలస్యం.. వెంటనే మీకు నచ్చిన.. మీ బడ్జెట్ లో ఉన్న మహీంద్రా మోడల్ కారును ఎంచక్కా ఆఫర్ లో కొనుక్కోండి