ఫిల్మ్ డెస్క్- ఘట్టమనేని సితార.. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ ల ముద్దుల కూతురు. చిన్న వయసులోనే తన ఆట పాటలు, చలాకీతనంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది సితార. అంతే కాదు సోషల్ మీడియాలో సితార చాలా యాక్డీవ్ గా ఉంటుంది. ఆమెను మహేష్ బాబు, నమ్రతలు కూడా బాగా ఎంకరేజ్ చేస్తారు. తన సింగింగ్, డాన్సింగ్ టాలెంట్ చూపిస్తూ మహేష్ అభిమానులను హుషారెత్తిస్తుంటుంది.
ఈ క్రమంలోనే సితార షేర్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మహేష్ బాబు మహర్షి సినిమాలోని.. పాలపిట్ట.. పాటకు గతంలో డ్యాన్స్ చేసి అలరించింది సితార. ఈ పాటపై సితార చేసిన డ్యాన్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదిగో మళ్లీ ఇప్పుడు ఓ వెస్టర్న్ పాటకు డ్యావ్స్ చేసింది సితార. ఫాస్ట్ బీట్ తో వస్తున్న ఆ పాటకు చాలా ఈజీగా అదిరిపోయే స్టెప్పులేసి ఔరా అనిపించింది సితార.
వెస్టర్న్ పాటకు సితార చాలా యాక్టివ్ పర్ ఫార్ మెన్స్ కనబరచడంతో అప్ కమింగ్ హీరోయిన్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి కొందరైతే ఇంకాస్త ముందుకెళ్లి.. సినీ ఇండస్ట్రీకి వస్తే మహేష్ బాబును మించి పోయేలా ఉంది అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. అంతే కాదు.. గ్రేట్ టాలెంట్, ఫ్యూచర్ సూపర్ స్టార్.. అనేవాళ్ళైతే లెక్కేలేదు. ఇక తన డ్యాన్స్ కు సంబందించిన వీడియోను తన సోషల్ మీడియా ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది సితార.
సోలోగా ట్రై చేశా.. ఇంకోటి చేయమంటారా?.. అని ట్యాగ్ కూడా చేసింది. ఇది చూసిన నెటిజన్స్ సితారపై ప్రశంసల వర్షం గుప్పిస్తున్నారు. సూపర్ స్టార్ కృష్ణకు తగిన మనవరాలు, మహేష్ బాబుకు తగ్గ కూతురు అని కొందరు కామెంట్స్ పెడుతున్నారు. మొత్తానికి సితార డ్యాన్స్ ఫెర్ఫామెన్స్ కు మహేష్ బాబు అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.