యువతి పేరు అపూర్వ హెంద్రే. స్థానికంగా ఉండే ఓ ఆస్పత్రిలో డాక్టర్ గా ప్రాక్టీస్ చేస్తోంది. డాక్టర్ గా మారి మా కూతురు పేదలకు సేవ చేస్తుందని యువతి తల్లిదండ్రులు ఎన్నో కలలు కంటున్నారు. అలా ప్రాక్టీస్ చేస్తున్న క్రమంలోనే కూతురు కానరాని లోకాలకు వెళ్తుందని ఆ తల్లిదండ్రులు ఊహించలేకపోయారు. నిన్నటి వరకు మాతో పాటు ఉన్న కూతురు ఉన్నట్టుండి అనుమానాస్పద స్థితిలో మరణించడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే. .అది మహారాష్ట్రలోని కొల్లాపూర్ ప్రాంతం. ఇదే ప్రాంతంలో తల్లిదండ్రులతో పాటు ఉంటున్న అపూర్వ హెంద్రే(30) స్థానికంగా ఓ ఆస్పత్రిలో డాక్టర్ గా ప్రాక్టీస్ చేస్తోంది. అయితే శనివారం రాత్రి అపూర్వ ఓ కార్యక్రమానికి వెళ్లి ఇంటికి వచ్చింది. అలా ఇంటికి వచ్చిందో లేదో అప్పుడే తిరిగి బయటకు వెళ్తూ ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లింది. దీంతో అనుమానం వచ్చిన యువతి తల్లిదండ్రులు బయటకు వెళ్లే ప్రయత్నం చేసి అంతా వెతికారు. ఎక్కడా కూడా యువతి జాడ కనిపించలేదు. దీంతో ఆ తల్లిదండ్రులు ఖంగారు పడి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు అటుగా వెళ్తున్నారు.
ఇది కూడా చదవండి: Rajasthan: సెలవు ఇవ్వలేదని రిఫైల్ తో కాల్చుకుని జవాన్ ఆత్మహత్య!
ఆ సమయంలో మీ కూతురు నడి రోడ్డుపై చనిపోయి ఉందని స్థానికులు తెలిపారు. దీంతో వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న యువతి తల్లిదండ్రులు విగతజీవిగా పడి ఉన్న కూతురిని చూసి కన్నీరు మున్నీరుగా విలపించారు. అయితే యువతి చేతికి ఇంజన్ గుచ్చి ఉండడంతో వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరీక్షలు జరిపిన వైద్యులు యువతి అప్పటికే మరణించినట్లు గుర్తించారు. యువతి ఆత్మహత్య చేసుకుందా? లేక మరెవరైన హత్య చేశారా? అన్న దానిపై ఇంకా క్లారిటీ లేదు. ఈ ఘటనపై అనుమానాస్పద కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.