కోట్లకు కోట్లు సంపాదించి ప్రభుత్వానికి పన్నుకట్టకుండా ఉండే వారి భరతం పట్టడానికి ఉన్న సంస్థలే సీబీఐ, ఈడీ, ఐటీ మెుదలగు సంస్థలు. దేశంలో ప్రముఖ వ్యాపార వేత్తలు, అధికారుల ఇల్లలో, కార్యాలయాలలో ఏకకాలంలో సోదాలు నిర్వహించడం ఈ శాఖల విధి. ఇటీవల బెంగాల్ మాజీ మంత్రి పార్థా ఛటర్జీ కుంభకోణం మరువక ముందే మరో భారీ ఈడీ దాడి మహారాష్ట్రలో వెలుగు చూసింది. దానికి సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను తనకు అనుగుణంగా వాడుకుంటోందని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. అయినప్పటికీ ఆదాయపు పన్నుశాఖ అధికారులు మాత్రం తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు. అందులో భాగంగానే తాజాగా మహారాష్ట్ర లో ఓ బడా వ్యాపారికి చెందిన ఇళ్లు, కార్యాలయాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో భారీగా అక్రమ ఆస్తులు బయటపడ్డట్లు సమాచారం.
మహారాష్ట్రలోని జల్నా పట్టణానికి చెందిన ఓ బడా వ్యాపారికి ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు సమాచారం అందడంతో అతని ఇల్లు, కార్యాలయంలో ఆదాయపు పన్ను శాఖ సోదాలు నిర్వహించింది. ఉక్కు, బట్టలు, రియల్ ఎస్టేట్ డెవలపర్ కు చెందిన వ్యాపారికి సంబంధించిన ప్రాంతాల్లో ఆగస్టు 1 నుంచి 8 వరకు ఈ దాడులు నిర్వహించింది.
ఈ సోదాల్లో రూ. 56 కోట్ల నగదు, 32కిలోల బంగారం, ముత్యాలు, ఆస్తి పత్రాలతో పాటుగా వజ్రాలతో సహా సుమారు రూ.100 కోట్ల బినామీ ఆస్తులను అధికారులు సీజ్ చేశారు. అధికారులకు పట్టుబడిన డబ్బును లెక్కించేందుకు ఏకంగా 13 గంటల సమయం పట్టినట్లు సమాచారం. డబ్బు లెక్కింపు యంత్రాలను సైతం వారు ఉపయోగించారు. అయితే ఈ ఆస్తులు ఎవరికి సంబంధించినవో, ఎక్కడివో లాంటి వివరాలను మాత్రం అధికారులు వెల్లడించలేదు. మరి వరసగా జరుగుతున్న ఈ భారీ ఐటీ దాడుల పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Maharashtra | Income Tax conducted a raid at premises of a steel, cloth merchant & real estate developer in Jalna from 1-8 Aug. Around Rs 100 cr of benami property seized – incl Rs 56 cr cash, 32 kgs gold, pearls-diamonds & property papers. It took 13 hrs to count the seized cash pic.twitter.com/5r9MHRrNyR
— ANI (@ANI) August 11, 2022