బుల్లితెర డెస్క్- బిగ్ బాస్.. ఈ రియాల్టీ షోకు ఎంత క్రేజ్ ఉందో, అంతే స్థాయిలో వివాదాలు అనుమానాలు ఉన్నాయి. బిగ్ బాస్ షో పై చాలా వివాదాలు కూడా నెలకొన్నాయి. బిగ్ బాస్ మొదటి సీజన్ నుంచి మొదలు ఇప్పుడు సాగుతున్న ఐదో సీజన్ వరకు చాలా మంది ఆరోపణలు, అనుమానాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
బిగ్ బాస్ రియాల్టీ షో అంతా ముందే అనుకున్న స్కిృప్ట్ ప్రకారం నడుస్తుందని, బిగ్ బాస్ లో క్యాస్టింగ్ కౌచ్ కూడా ఉందని.. చాలా ఆరోపణలు వచ్చాయి. వీటన్నింటిని ఏ మాత్రం పట్టించుకోని బిగ్ బాస్ షో మాత్రం క్రేజీగానే సాగుతోంది. హౌస్‌లో నడిచే రచ్చ మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంది. ఇక బిగ్ బాస్ అంటేనే ఫైర్ అయిపోయే సినీ నటి మాధవీలత మరోసారి ఈ షోపై షాకింగ్ కామెంట్స్ చేసింది.
బిగ్ బాస్ హౌస్ ముద్దులు, హగ్గులు, రొమాన్స్ కి అడ్డాగా మారిందని మాధవీలత పరోక్షంగా కామెంట్స్ చేసింది. షన్ను, సిరి, మానస్, పింకీ ఇలా బిగ్ బాస్ కంటిస్టెంట్స్ పేర్లు తీస్తూ కామెంట్స్ చేసిన మాధవీలత, మరదలు అంటే రొమాన్స్ కాదు.. సరదా, సంతోషం.. బావ మరదలు మన సంప్రదాయంలో బెస్ట్ అండ్ బ్యూటిఫుల్ రిలేషన్ అని చెప్పుకొచ్చింది.
ఇంతకీ మాధవీ లత ఎమందంటే.. చక్కగా గుడ్ నైట్ చెప్పేసి చల్లగా పడుకుందాం.. మార్నింగ్ కార్తీక పూర్ణిమ ఉంది కదా అనుకుంటే.. బిగ్ బాస్ లో రగులుతోంది మొగలిపొద సీన్స్ జరిగాయి, గుస గుస అని మెసేజీలు పెడితే ఎలా బజ్జుకోవాలి నేను.. అయ్యో రామా ఎంత కష్టమొచ్చింది నాకు.. బిగ్ బాస్ హౌస్ లవర్స్ అడ్డా.. మనం ఇందులో పడ్డా అవుతాం చెడ్డా.. కృష్ణ కృష్ణ.. పగవాడికి కూడా వద్దు ఈ బాధ.. అని ఘాటుగా కామెంట్ చేసింది మాధవీలత.
అంతే కాదు బిగ్ బాస్ రగులుతోంది మొగలిపొద వీడియోలు తనకు రిసీవ్ అయ్యాయని, కాకపోతే వాటిని పబ్లిష్ చేయడం కల్చర్ కాదు అని చెప్పింది. మరి మాధవీలత అనుమానాలు, ఆరోపణలపై బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఏ మేరకు స్పందిస్తారన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.