బడిని.. గుడిలా భావించే దేశం మనది. అలాంటి పవిత్ర విద్యాలయాన్ని అపవిత్రం చేశాడు.. ఓ ఉపాద్యాయుడు. పిల్లలకు విద్యా బుద్ధులు నేర్పుతూ.. ఉపాధ్యాయులకు దిశానిర్దేశం చేయాల్సిన ప్రధానోపాధ్యాయుడే రాసలీలలకు తెరలేపాడు. స్కూల్లో పనిచేసే మహిళా ఉద్యోగితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయాన్ని పసిగట్టిన విద్యార్థులు, వారి బండారం బయటపెట్టాలని భావించి.. వాళ్లిద్దరూ కలిసుండగా వీడియో తీశారు. ఈ ఘటన కృష్ణాజిల్లా మచిలీపట్నంలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. మచిలీపట్నం చిలకలపూడి రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న ప్రభుత్వ ఉర్దూ మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలో ఆనంద్ బాబు అనే వ్యక్తి ప్రిన్సిపల్ గా విధులు నిర్వహిస్తున్నారు. అదే పాఠశాలలో యుడిసిగా (కంప్యూటర్ ఆపరేటర్)గా విధులు నిర్వహిస్తున్న మహిళా ఉద్యోగినితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఎప్పుడు పడితే అప్పుడు ఆమెను తన రూమ్ కు పిలిపించుకొని కామక్రీడల్లో మునిగేవాడు. ఈ విషయం అందరకీ తెలిసినా.. ప్రధానోపాధ్యాయుడు కనుక ఏమీ తెలియనట్లు నటించేవారు. ఇలానే ఒకరోజు రాత్రి సమయంలో పాఠశాల కాంపౌండ్‌లో మహిళాతో శృంగారం మొదలుపెట్టాడు.
ఈ రాసలీలల బాగోతాన్ని పసిగట్టిన కొందరు విద్యార్థులు సీక్రెట్‌గా వీడియో తీశారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ విషయం తెలుసుకున్న ప్రిన్సిపల్ ఆ విద్యార్థులను విచక్షణారహితంగా చితకబాదాడు. దీంతో భయపడిపోయిన విద్యార్థులు స్కూల్ కు వెళ్లడానికి ఇష్టపడట్లేరట. ఏం జరిగిందని తల్లిదండ్రులు ఆరాతీయగా అసలు విహస్యం బయటకొచ్చింది. చివరకు ఈ విషయం పోలీస్‌స్టేషన్‌దాకా వెళ్లడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేసున్నారు. వారిద్దరి మధ్య కొన్నినెలలుగా ఈ తంతు జరుగుతుందని విద్యార్థులు పోలీసులకు తెలిపారు.