మా ఊరి పొలిమేర సినిమా చూసిన వారు.. పొలిమేర 2 ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఫైనల్ ట్విస్టులకు రెండో భాగంలో ఎలాంటి ముగింపు ఉంటుందా అని ఆలోచిస్తున్నారు.
ఓటీటీలో సినిమాలు చూసే వారికి ‘‘మా ఊరి పొలిమేర’’ సినిమా గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. చిన్న సినిమాగా ఓటీటీలోకి వచ్చి.. పొలిమేర పెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది. ఫైనల్ ట్విస్ట్‌లతో ప్రేక్షకుల మతిని పోగొట్టింది. చూసిన వారందరినీ ఎంతో ఆకట్టుకుంది. హర్రర్, సస్పెన్స్, ఊహకందని ట్విస్ట్‌లతో వ్వావ్ అనిపించేలా సినిమా ఉంటుంది. మౌత్ పబ్లిసిటీ ద్వారా స్లో పాయిజన్‌లాగా ఎక్కిపోయింది. ఇక, ఈ సినిమా క్లైమాక్స్‌లో ట్విస్టులు పెట్టి.. రెండో భాగానికి కూడా స్కోప్ ఉండేలా చూసుకున్నాడు దర్శకుడు. ప్రస్తుతం పొలిమేర 2 సినిమా షూటింగ్ పూర్తయి.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే చిత్ర బృందం పొలిమేర 2 పోస్టర్‌ను రిలీజ్ చేసింది.
శనివారం పోస్టర్ రిలీజ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చిత్ర పోస్టర్‌ను విడుదల చేశారు. సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవాలని ఆకాంక్షించారు. చిత్ర దర్శకుడు అనిల్ విశ్వనాథ్, నిర్మాత గౌరి కృష్ణ, ఇతర నటీ,నటులు, చిత్ర బృందాన్ని ఆయన అభినందించారు. పొలిమేర చిత్ర దర్శక,నిర్మాతలు మాట్లాడుతూ ఈ సినిమా అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుందని చెప్పారు. ఇక, పోస్టర్ విషయానికి వస్తే ఆ పోస్టర్‌లో సత్యం రాజేష్ శ్మశానంలో కూర్చుని ఉన్నాడు. ఒంటిపై కేవలం గోచితో.. వీపుపై రక్తం కారుతూ ఉండగా ఓ భయంకరమైన ఫోజులో దర్శనమిస్తున్నాడు.
అతడి ముందు చితి మంటలు, పక్కన ఓ నాగు పాము ఉన్నాయి. అంటే పొలిమేర 2.. ముందు భాగాన్ని మించి భయంకరంగా ఉండబోతోందని దర్శకుడు అనిల్ చెప్పకనే చెప్పారు. ఈ పోస్టర్‌కు సోషల్ మీడియా వ్యాప్తంగా మంచి రెస్పాన్స్ వస్తోంది. కాగా, ఈ సినిమాలో సత్యం రాజేష్, డా. కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను, రాకేందు మౌళి, అక్షత, బాలాదిత్య, సాహితి దాసరి, రవి వర్మ, చిత్రం శ్రీను ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మరి, పొలిమేర 2 చిత్ర పోస్టర్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.