చాలా నగరాల్లో కరోనాతో లాక్‌డౌన్, నౌట్ కర్ఫ్యూ అమలు అవుతోంది. దీంతో ప్రజలకు సమస్యలు కూడా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ కోసం సమయం పట్టే అవకాశం ఉంటుంది. వాస్తవానికి కరోనాతో గ్యాస్ కంపెనీలో చాలా మంది కరోనా బారినపడ్డారు. దీని వల్ల గ్యాస్ సిలిండర్ల పంపిణీలో మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. కాగా, గత ఇరవై రోజుల్లో గ్యాస్ సిలిండర్ల డెలివరి విషయంలో వెయిటింగ్ పీరియడ్ మూడు రోజులు పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో వినియోగదారులు సిలిండర్ల కోసం మరింత వేచి చూసే అవకాశం ఉంది. గ్యాస్ హోమ్ డెలివరీ నిలిపి వేస్తామని గ్యాస్ పంపిణీదారులు హెచ్చరించారు. ఇతరులతోపాటు తమల్ని కూడా ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా గుర్తించాలని గ్యాస్ పంపిణీ దారులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే వెంటనే కరోనా వ్యాక్సిన్ కూడా అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఇప్పటికే చాలా మంది పంపిణీదారులకు వైరస్ సోకిందని తెలిపారు. గ్యాస్ పంపిణీ చేసే వారు ప్రాణాలను లెక్కచేయకుండా ఇంటింటికీ వెళ్లి ఎల్‌పీజీ సిలిండర్లు అందజేయాల్సి ఉంటుందన్నారు. అందువల్ల ప్రభుత్వం పంపిణీ దారులను ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా గుర్తించాలని కోరారు. తెలంగాణ ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూషన్స్ అసోసియేషన్ ఈ విధంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. కరోనా వ్యాక్సినేషన్ చేపట్టకుంటే ఈ నెల 29 నుంచి గ్యాస్ సిలిండర్ హోమ్ డెలివరీ నిలిపేస్తామని అసోసియేషన్ అల్టిమేటం జారీచేసింది.