టీమ్ ఇండియా విదేశీ సీరిస్ కి వెళ్లిన ప్రతిసారి ప్రత్యర్థి జట్లు తమ వివాదాస్పద ప్రవర్తనతో వార్తల్లో నిలుస్తున్నాయి. గతంలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లు తమ పరువు ఇలానే తీసుకున్నాయి. అయితే.., ఇప్పుడు కూడా ఇంగ్లాండ్ టీమ్..బాల్ టాంపరింగ్ వివాదంలో చిక్కుకుంది. ఇంగ్లాండ్ తో లార్డ్స్ లో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో ఇండియా పోరాటాన్ని కొనసాగిస్తోంది. సెకండ్ ఇన్నింగ్స్ లో ఇండియన్ ఓపెనర్స్ త్వరగా పెవిలియన్ చేరడం, కెప్టెన్ కోహ్లీ మరోసారి నిరుత్సాహపరచడంతో మ్యాచ్ ఇంగ్లాండ్ చేతుల్లోకి వెళ్ళిపోయినట్టు అనిపించింది. ఇలాంటి దశలో పుజారా, రహానే క్రీజ్ లో పాతుకుపోయారు. తమ డిఫెన్స్ తో ఇంగ్లాండ్ బౌలర్స్ చుక్కలు చూపించారు. దీంతో.., వీరి వికెట్స్ తీయలేకపోయిన ఇంగ్లాండ్ జట్టు బాల్ టాంపరింగ్ కి పాల్పడిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలు, వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రిలీజైన వీడియోలో బంతిని ఉద్దేశపూర్వకంగా కింద పడేసి.. బూట్లతో తన్నుతూ.. బూట్ల స్పైక్స్‌తో అదిమి తొక్కుతూ… ఆకారాన్ని మార్చేందుకు ప్రయత్నించడం టీవీల్లో స్పష్టంగా కనిపించింది. స్పైక్స్ బాటమ్ ఎంత రఫ్ గా ఉంటాయో చెప్పాల్సిన పని లేదు. ఆ బూట్లతో బాల్ ని తొక్కితే టాంపరింగ్ చేయడం చాలా సులభం. దీన్నే ఇంగ్లాండ్ ఆటగాళ్లు అమలు పరిచారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఈ వీడియోలో మొహాలు చూపించకపోవడంతో టాంపరింగ్ చేసిన ఆటగాళ్లు ఎవరనేది కనిపెట్టడం కష్టంగా మారింది. దీంతో.., ఇంగ్లాండ్ ప్లేయర్లపై ఐసీసీ విచారణ జరిపించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ వినిపిస్తోంది. 2018 కేప్‌టౌన్ టెస్ట్‌లో సాండ్ పేపర్ విధానంతో బెన్ క్రాప్ట్ బాల్‌టాంపరింగ్‌కు చేసి దొరికిపోయాడు. ఈ ఘటన క్రికెట్ ప్రపంచాన్నే ఊపేసింది. అవన్నీ.., తెలిసి కూడా ఇప్పుడు ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఈ చర్యకి పాల్పడటం గమనార్హం. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.
Any action against England??#ENGvsIND pic.twitter.com/4B80fwvHeM
— Aaryan🥂 (@unoffensivebrat) August 15, 2021