రీసెర్చ్ డెస్క్- కరోనా మహమ్మారి అంతకంతకు పాకిపోతోంది. కరోనా ఫస్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్ మంరి వేగంగా వ్యాపిస్తోంది. భారత్ లాంటి దేశంలో కరోనా కేసులు రోజు నాలుగు లక్షలు దాటుతున్నాయంటే పరిస్థితి ఏవిదంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇంతటి గడ్డు కాలాన్ని ఎప్పుడూ చూడలేదని అందరు వాపోతున్నారు. ఐతే ఇలాంటి ఉపద్రవం ప్రపంచానికి కొత్తేం కాదు. ఎందుకంటే సుమారు వందేళ్ల క్రితం ఇలాంటి సంక్షోభమే తలెత్తింది. భారత్ కు స్వాతంత్ర్యం రాకముందు 1918లో ప్రబలిన స్పానిష్ ఫ్లూ కోట్ల మందిని బలి తీసుకుంది. ప్రస్తుతం జన జీవనాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ తో అప్పటి స్పానిష్ ఫ్లూ ను పోలుస్తున్నారు. ప్రంచాన్ని గడగడలాడించిన స్పానిష్ ఫ్లూకు సంబంధించి కొన్ని ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 1918 లో ప్రబలిన స్పానిష్ ఫ్లూ పై సుమన్ టీవీ ప్రత్యేక కధనం మీకోసం..
స్పానిష్ ఫ్లూ వైరస్ ను మొట్టమొదటి సారి స్పెయిన్‌లో గుర్తించారు. అందుకే దీనికి స్పానిష్ ఫ్లూ అని పేరు వచ్చింజి. 1918 జనవరిలో ఈ వైరస్ బయటపడింది. దాదాపు మూడేళ్ల తరువాత అంటే 1920 డిసెంబర్ లో స్పానిష్ ఫ్లూ అంతమైందని చెబుతారు. సుమారు మూడేళ్ల పాటు ఈ వైరస్ ప్రపంచాన్ని పట్టి పీడించింది. ప్రపంచ వ్యాప్తంగా స్పానిష్ ఫ్లూ సోకి మూడేళ్ల వ్యవధిలో దాదాపు 5 కోట్ల మంది చనిపోయారని అనిధికార లెక్కలు చెబుతున్నాయి. భారత్ లో స్పానిష్ ఫ్లూ ప్రభావం మరీ ఎక్కువగా చూపిందని తెలుస్తోంది. స్పానిష్ ఫ్లూ వల్ల ప్రపంచ వ్యాప్తంగా 5 కోట్ల మంది చనిపోతే, అందులో 1కోటి 70 లక్షల మంది భారతీయులే కావడం విచారకరం. ఈ వైరస్ బారిన పడి మరణించిన వారిలో 43 శాతం మంది భారతీయులు ఉన్నారన్నమాట. స్పానిష్ ఫ్లూ వ్యాపించే నాటికి ప్రపంచంలో ఎక్కడా యాంటీబయాటిక్స్ అందుబాటులోకి రాలేదు.
ఇక స్పానిష్ ఫ్లూ ప్రబలడానికి అనేక కారణాలు చెబుతారు. అప్పుడప్పుడే ముగిసిన మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో శత్రువుల నుంచి కాపాడుకునేందుకు సైనికులు సొరంగాల మాదిరిగా పెద్ద పెద్ద కందకాలు తవ్వుకుని అందులో తలదాచుకునేవారు. అలా తవ్విన కందకాలు అపరిశుభ్రంగా మారి.. అక్కడి నుంచే వల్లే స్పానిష్ ఫ్లూ పుట్టిందని అంటారు. 1918లో ముందు స్పెయిన్ కు చెందిన ఓ సైనికుడిలో ఈ వైరస్ లక్షణాలను గుర్తించారు. తీవ్ర జ్వరం రావడం, జలుబు లక్షణాలు కనిపించాయట. ఆఖరికి నుమోనియా బారిన పడి ఆ సైనికుడు చనిపోయాడు. ఐతే జరగాల్సిన అనర్ధం జరిగిపోయింది. ఆ సైనికుడి నుంచి మరి కొంత మంది సైనికులకు ఈ వైరస్ వ్యాపించింది. అలా మెల్ల మెల్లగా యూరప్ దేశాలన్నింటికీ ఈ వైరస్ ఇది విస్తరించింది. అప్పట్లో విమాన సౌకర్యాలు అంతంత మాత్రమే అయినా.. నౌకలు, రైళ్ల ద్వారా రాకపోకలు సాగించే వారి ద్వార ఈ వైరస్ ఇతర దేశాలకు వ్యాప్తి చెందిందట. భారత్‌లో ఈ వైరస్ లక్షణాలు మొట్టమొదటి సారి ముంబై పోర్టులో పనిచేసే ఓ ఉద్యోగిలో కనిపించాయని చెప్పారు.
ముంబై పోర్టులో పనిచేసే ఓ ఉద్యోగికి తీవ్ర జ్వరం రావడంతో మలేరియాగా భావించి అతడికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈలోపే ఆ వైరస్ అతని నుంచి ఇతరులకూ వ్యాపించింది. 1918లో మొదటి ప్రపంచ యుద్ధం ముగిశాక తిరిగి ముంబైకి సముద్ర మార్గంలో చేరుకున్న సైనికుల ద్వారా అతనికి వైరస్ సోకిందని తేల్చారు. అలా ఇండియాలోకి ప్రవేశించిన వైరస్ ముంబై నగరం మొత్తం వ్యాపించింది. అక్కడి నుంచి దేశంలో మిగతా ప్రాంతాలకు విస్తరింతించి. గుజరాత్‌లో మహాత్మ గాంధీ గడిపిన ఆశ్రమంలో కూడా ఒకరికి ఈ వైరస్ సోకడంతో.. అతని ద్వార గాంధీకి కూడా ఈ వైరస్ సోకింది. మన దేశంలో అప్పట్లో సరైన వైద్య సదుపాయాలు లేవు. ఆసుపత్రుల్లో సరిపడా బెడ్స్ అందుబాటులో లేవట. ఇక చేసేదేమీ లేక వైరస్ సోకిందని తెలిసినా ఇంటి వద్దే మంచాన పడి చావు కోసం ఎంతోమంది ఎదురుచూశారని చెబుతారు.
సుమారు మూడేళ్లలో 1 కోటీ 70 లక్షల మంది చనిపోవడంతో వారిని దహనం చేసేందుకు కట్టెలు కూడా లేని పరిస్థితి నెలకొంది. దీంతో గంగా నదిలో శవాలను వదిలారని అంటున్నారు. ఇక ఇప్పటి కరోనా కు, అప్పటి స్పానిష్ ఫ్లూకు దగ్గరి పోలికల ఉన్నాయనే చర్చ జరుగుతోంది. జ్వరం, నుమోనియా స్పానిష్ ఫ్లూ లక్షణాలు కాగా.. కరోనా కూడా జ్వరంతో పాటు ఊపిరితిత్తులపై ప్రభావాన్ని చూపి శ్వాస సంబంధ సమస్యతో మనిషిని మృత్యు ఒడిలోకి చేరుస్తోంది.
స్పానిష్ ఫ్లూ నుంచి రక్షణ పొందెందుకు ఇప్పుడు ఉపయోగిస్తున్న మాదిరిగానే మాస్కులు, ప్లాస్టీక్ పీపీఈ కిట్ లు ఉపయోగించారు. అప్పట్లో క్వారంటైనే సెంటర్లు, లాక్ డౌన్ లు కూడా విధించారు. అందుకు సంబందించిన ఫోటోలను మనం చూడవచ్చు.