భారతీయ జాతీయ బీమా సంస్థ ఎల్.ఐ.సి గురించి ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రజలకి పెట్టుబడుల కోసం ఎల్.ఐ.సి ఎప్పటికప్పుడు నూతన పథకాలను ప్రవేశ పెడుతూనే ఉంటుంది. ఇందులో భాగంగానే ఎల్.ఐ.సీ ఇప్పుడు ఇప్పుడు మరో కొత్త పథకాన్ని ప్రజల ముందుకి తీసుకొచ్చింది. ఈ పథకం పేరు ‘ఆధార్ శిలా’. భారతీయ మహిళలలు స్వావలంబన సాధించడానికి తోడ్పడటమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. మరి ఇందులో పెట్టుబడులు ఎలా పెట్టాలి? ఎంత కాలానికి ఎంత రిటర్న్ వస్తుందన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఆధార్ శిలా ఈ పథకంలో 8 నుంచి 55 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న మహిళలు ఎవరైనా పెట్టుబడులు పెట్టవచ్చు. ఇందులో పెట్టుబడి పెట్టిన వారికి మెచ్యూరిటీ సమయంలో 4 లక్షలు రూపాయలు పొందే అవకాశం ఉంటుంది. అయితే.., ఇందుకు 20 సంవత్సరాల వరకు, రోజుకి 29రూపాయలు పెట్టుబడి పెడితే సరిపోతుంది. అంటే సంవత్సరానికి 10585 మాత్రమే. దీనికి 4.5% పన్ను కలిపితే రూ.10,959 అవుతుంది. ఇలా వరసగా 20 సంవత్సరాల పాటు మనం మొత్తం రూ.2,14,696 చెల్లించాలి. కానీ.., మెచ్యూరిటీ తీరాక ఎల్.ఐ.సి నుండి మనకి అక్షరాల 4 లక్షలు రూపాయలు లభిస్తాయి. అంటే సగానికి సగం లాభం అనమాట.
ఇందులో పెట్టుబడిదారులు తమ ప్రీమియంలను నెలవారీ, త్రైమాసిక లేదా అర్ధ-వార్షిక ప్రాతిపదికన కూడా చెల్లించుకోవచ్చు. ఇక ఎల్‌ఐసి ఆధార్ శిలా పథకంలో జాయిన్ అవ్వడానికి పెట్టుబడిదారులకు ఆధార్ కార్డు అవసరం. కాబట్టి.., ఈ పథకంపై ఆసక్తి ఉన్నవారు వెంటనే ఎల్‌ఐసి ఏజెంట్‌ను గాని, మీకు సమీపంలోని ఎల్.ఐ.సి బ్రాంచ్ ని గాని సందర్శించండి. మరి.., అంతకు రెండింతలు రిటర్న్స్ అందించే ఈ ఆధార్ శిలా పథకంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.