మీకు నిత్య పెళ్లి కొడుకుల తంతు గురించి తెలుసు కదా? ప్రేమ పేరుతో దగ్గర అవ్వడం, అమ్మాయిని నమ్మించి పెళ్లి చేసుకోవడం, కట్నంగా వచ్చిన కోట్ల డబ్బుతో ఉడాయించడం. ఇలాంటివి మగవాళ్ళు చేయడం మీరు చాలాసార్లు వినే ఉంటారు. కొన్నిసార్లు చూసి ఉంటారుకూడా? కానీ.., ఇప్పుడు మనం చెప్పుకోబోయేది నిత్య పెళ్లి కూతురు గురించి. ఒకటి కాదు, రెండు కాదు.., ఏకంగా నాలుగు పెళ్లిళ్లు చేసుకుని భర్తలని బురిడీ కొట్టించి కోట్లు కాజేసిన కిలాడి లేడీ గురించి. మాములుగా ఇలాంటి మోసాలు సైబర్ నేరగాళ్లు చేస్తారు. కానీ.., ఫస్ట్ టైమ్ ఒక లేడీ కానిస్టేబుల్ ఇలాంటి పని చేసి అందరికీ షాక్ ఇచ్చింది. బాధ్యతాయుతమైన పోస్ట్ లో ఉండి కూడా మోసాలకు పాల్పడిన ఆ మహిళ ఎవరో, ఆమె కథ ఏమిటో ఇపుడు తెలుసుకుందాం. సంధ్యారాణి అనే మహిళ హైదరాబాద్లోని ఏఆర్ హెడ్ క్వార్టర్స్లో కానిస్టేబుల్గా పనిచేస్తోంది. డబ్బులున్న యువకులను ట్రాప్ చేసి వారిని ప్రేమ పేరుతో వలలో వేసుకోవడం ఈమెకి అలవాటు. అనంతరం వారిని దొంగ పెళ్లి చేసుకుని ఆస్తినంతా స్వాహా చేసేస్తోంది. ఈ క్రమంలోనే సంధ్యారాణికి ఇప్పటికే మూడు పెళ్లిళ్లు అయ్యాయి. 8 సంవత్సరాల పాప కూడా ఉంది. ముగ్గురిలో ఇద్దరికి విడాకులివ్వగా.., మరో భర్త సంధ్యారాణి వేధింపులు భరించలేక ఆత్మ హత్య చేసుకున్నాడు.
తాజాగా .. షాబాద్ మండలం హైతబాద్ కు చెందిన చరణ్ తేజ ను సంధ్యారాణి ట్రాప్ చేసి పెళ్లి చేసుకుంది.ఉద్యోగ రీత్యా హైదరాబాద్ వచ్చిన చరణ్ తేజను సంధ్యారాణి ట్రాప్ చేసి ప్రేమ పేరుతో వచించింది. పరిచయం అయిన కొత్తలో ఇద్దరూ కలిసి చాలా చోట్ల తిరిగారు. వెళ్లిన చోటల్లా ఫోటోలు దిగారు. కొన్నాళ్లకు చరణ్ ను పెళ్లి చేసుకోమని కోరింది సంధ్యారాణి. పెళ్లి చేసుకోక పోతే SC, ST అట్రాసిటీ కేసు పెడతానని లేకపోతే ఇద్దరం కలిసి తిరిగిన ఫోటోలు, వీడియోస్ బయటపెడతానని బెదిరించింది. కానీ.., ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏమిటో తెలుసా? గతంలో తనకి మూడు పెళ్లిళ్లు అయిన విషయం చరణ్ తేజ్ కి చెప్పలేదు సంధ్యా రాణి. ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్న యువకుడు పోలీసులను ఆశ్రయించాడు. ఇక ఇక్కడ మరో ట్విస్ట్ ఏమిటంటే.. సంధ్యారాణి ప్రేమ పేరుతో, పెళ్లి పేరుతో యువకులను మోసం చేస్తోందని ఆమె తల్లిదండ్రులే ఆమెపై గతంలో ఓ కేసు పెట్టి ఉన్నారు. దీనితో సంధ్యా రాణి ని డిపార్ట్మెంట్ నుండి సస్పెండ్ చేసి.., విచారణ జరపాలని నెటిజన్స్ కోరుతున్నారు. మరి.. ఇలాంటి కిలాడీ లేడీకి ఏ శిక్ష పడాలని మీరు కోరుకుంటున్నారు? మీ అభిప్రయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.