రామాయణ మహాభారతాది గ్రంధాలు.. ఇతిహాసాలు, చరిత్ర పుటలు తిరగేసినా ఇదే కనిపిస్తుంది .. సింహాసనం ఎక్కడం ఎలా .. సార్వభౌమత్వం పొందటం ఎలా ఇదే ఆలోచన ..పదవీ వ్యామోహం!..అధికార కాంక్ష!అందుకోసం ఎత్తులు పై ఎత్తులు.. ఎన్నో తంత్రాలు ,కుతంత్రాలు, కుట్రలు,పన్నాగాలు ఈ రాజకీయ చదరంగం లో పావులను తెలివిగా మారుస్తుంటారు. పెద్దలు ఇచ్చిన తీర్పుని మంచి సలహాలను పెడచెవిని పెట్టి ఇష్టం వచ్చిన రీతిలో ప్రవర్తిస్తుంటారు.విన్నవారు చరిత్రలో గొప్పవ్యక్తులుగా మిగిలారు ..మిగాతావారు చరిత్ర హీనులయ్యారు ..అది మహాసామ్రాజ్య చక్రవర్తి హోదా కోసం పడిన పోరాటం!..
ఇది జగమెరిగిన సత్యం !ఇదంతా ఎందుకు గుర్తుకు తెచ్చుకోవలసిందంటే ప్రస్తుతం ‘మా’ నాయకునిగా పదవి అధిష్టించి గుర్తింపు పొందాలని,మంచి అభివృద్ధిని కలిగించే కార్యక్రమాలు చేయాలని పలువురు చిత్ర ప్రముఖులు,నటులు బరిలో దిగి మా నాయకత్వం కోసం ఆరాట పడుతున్నారు..ఎన్నోసార్లు ఈ విషయంపై తర్జన భర్జనలు జరిగాయి.కానీ సమస్య జటిలంగా తయారైంది..సరైన పరిష్కారం దొరక్క చివరకు ‘మా’లోని సభ్యుల మధ్య తలెత్తిన విభేదాలను పరిష్కరించటానికి..కార్యక్రమాలు సజావుగా జరిగేలా చూడటానికి 2019లో కృష్ణంరాజు అధ్యక్షతన క్రమశిక్షణ సంఘాన్ని ఏర్పాటు చేశారు.
ఇందులో చిరంజీవి, మురళీమోహన్, జయసుధ, మోహన్‌బాబు ఈ సంఘంలో సభ్యులు. ‘మా’లో తలెత్తిన విభేదాల పరిష్కారంలో ఈ సంఘానిదే తుదినిర్ణయం. వీరి అభిప్రాయాలకు అందరూ మద్దతునివ్వాలి. ఈ విషయంపై ఎగ్జిక్యూటివ్ కమిటీలో కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇదిలాఉండగా సుమారు నాలుగు నెలల క్రితం చిరంజీవి క్రమశిక్షణ సంఘ సభ్యత్వానికి రాజీనామా చేశారు.
కానీ దీనిని ఇతర సభ్యులు ఇంకా అంగీకరించలేదు. అధికారికంగా ఆయన ఆ పదవిలో కొనసాగుతున్నట్లే లెక్క. ప్రస్తుత ‘మా’ ఎగ్జిక్యూటివ్ కమిటీ పదవీకాలం ఈ ఏడాది మార్చిలో ముగిసింది. అయితే కోవిడ్ వల్ల ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఈ ఎన్నికలు ఎప్పుడు జరుపుతారంటూ కొందరు సభ్యులు ‘మా’ అధ్యక్షుడికి , కృష్ణంరాజుకు ఉత్తరాలద్వారా పంపినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఎన్నికలు ఎప్పడు జరపాలనే విషయంపై అభిప్రాయాలను చెప్పాలంటూ కృష్ణంరాజు మిగిలిన నలుగురు సభ్యులను కోరినట్లు వర్గాలు వెల్లడించాయి. వీరి నుంచి సమాధానాలు వచ్చిన తర్వాత ఆయన తుది నిర్ణయం వెల్లడించే అవకాశముంది. ‘మా’ నిబంధనల ఆధారంగా చూస్తే- అదే తుది నిర్ణయమవుతుంది.
ఒక వేళ వచ్చే మార్చి వరకు ‘మా’ ఎన్నికలు జరగకపోతే – అప్పటి దాకా ఒక తాత్కాలిక కమిటీని నియమించాలనే ఆలోచన కూడా ఉన్నట్లు తెలుస్తోంది .ఎన్నికల కోసం రంగంలో దిగిన రెండు ప్యానల్స్ ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకోకుండా చూడటం..పెండింగ్‌లో ఉన్న ‘మా’ కార్యకలాపాలను పూర్తిచేయటం..
ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేలా చూడటం ఈ కమిటీ ప్రధాన బాధ్యతలు.ఈ కమిటీకి ఒక ప్రముఖ సినీ నటిని అధ్యక్షురాలిగా నియమించాలనే అభిప్రాయాన్ని వ్యక్తీకరించినట్లు ..దానికి ఆనటి అంగీకరించనట్లుతెలుస్తోంది.ఏది ఏమైనా కృష్ణంరాజు నేతృత్వంలోజరిగేకీలకనిర్ణయం‘మా’సమస్యకుసరైనపరిష్కారంలభిస్తుందని, అందరూఎదురుచూస్తున్నారు. .