అతను అందరిలానే సాధారణ కుర్రాడు. చిన్న తనంలోనే తండ్రి చనిపోతే.., తల్లి కష్టపడి పెంచింది. అతనికి అమ్మ అంటే చచ్చే అంత ఇష్టం. బీఎస్సీ కంప్యూటర్స్ చదివాడు. కానీ.., అతని తల్లి పోలీస్ అవ్వమండి. నిన్ను ఖాకీ బట్టలో చూడాలని ఓ కోరిక కోరింది. చివరికి ఆ కొరికే అతన్ని జైలు పాలు చేసింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. కృష్ణా జిల్లాతోట్లవల్లూరు మండలం రొయ్యూరుకు చెందిన లుక్కా ఫృథ్వీరాజ్ డిగ్రీ చదివాడు. అతని తల్లికి కొడుకుని పోలీస్ గా చూడటం ఇష్టం. దీంతో.. ఫృథ్వీరాజ్ తల్లి కోరిక ప్రకారం 2017లో పోలీసు కానిస్టేబుల్ సెలక్షన్స్‌కు వెళ్లారు. కానీ.., అతనికి అక్కడ ఉద్యోగం రాలేదు. అయితే.., తన తల్లిని నిరుత్సాహ పరచాలి అనుకోలేదు పృథ్వి. దీంతో.., తనకు విజయవాడ సమీపంలో పోలీసు ఉద్యోగం వచ్చిందని అబద్దం చెప్పి అందరిని నమ్మించాడు.
తన తల్లినే కాదు ఊరిలోనే యూనిఫాంలో తిరుగుతూ అందరిని నమ్మించాడు. ఇక సంవత్సరం క్రితం పెళ్లి కూడా చేసుకున్నాడు. దీంతో.. ఫృథ్వీరాజ్ పై ఎవరికీ అనుమానం రాలేదు. పైగా.., తనకి శిక్షణ కోసం వెళుతున్నానని చెప్పి.. కొద్ది నెలల పాటు ఇంటికి దూరంగా ఉన్నాడు. అలా బయటకి వచ్చి..స్నేహితుడికి చెందిన కోళ్ల ఫారంలో పనిచేసేవాడు. జీతం వచ్చిందని ప్రతి నెలా కొంత డబ్బు ఇంట్లో ఇస్తూ ఎవరికీ అనుమానం రాకుండా చూసుకున్నాడు. ఇలానే కంటిన్యూ అయ్యి ఉంటే.. ఏ నకిలీ పోలీస్ అస్సలు అరెస్ట్ అయ్యేవాడు కాదు. కానీ.., ఇప్పుడు ఫృథ్వీరాజ్ అనుకోకుండా రియల్ పోలీస్ లకి దొరికిపోయాడు.
కండ్రిక కూడలిలో ఆదివారం వాహనాలు తనిఖీలు చేస్తుండగా.. యూనిఫాంలో బైక్‌పై వెళుతున్న ఫృథ్వీరాజ్‌ని ఆపారు. అతని తనని తాను పోలీస్ గా పరిచయం చేసుకున్నాడు. కానీ.., డ్యూటీ ఉన్న పోలీసులకి అనుమానం రావడంతో పూర్తి వివరాలు అడగ్గా తడబడ్డాడు. దీంతో.., పృథ్విరాజ్ నకిలీ పోలీసుగా తేలింది. దీంతో పోలీసులు ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే.. పృథ్విరాజ్ ఈ మూడేళ్ళ కాలంలో ఎవ్వరినీ యూనిఫాంతో బెదిరించలేదు. కేవలం తన తల్లి సంతోషం కోసమే పోలీసు ఉద్యోగం వచ్చిందని అబద్దం చెప్పాడు. కోళ్ల ఫారంలోపని చేస్తూ.. ప్రతి రూపాయి కష్టపడే సంపాదిస్తున్నాడు. మరి.. అమ్మ కోసం ఫృథ్వీరాజ్ చేసిన ఈ పనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.