ఏ రైలు ఏ రైలుని ఢీ కొట్టింది.. ఆ 20 నిమిషాల్లో ఏం జరిగింది?

కోరమాండల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదం వెనుక కారణాలు ఏంటీ అని ప్రజలు అవాక్కయిపోతున్నారు. మెుదటగా ప్రమాదం ఎలా జరిగింది. ఏ రైలును ఏరైలు ఢీకొట్టింది.. అని ప్రజలు ఆశ్చర్యానికి గురవుతున్నారు.

కోరమాండల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదం వెనుక కారణాలు ఏంటీ అని ప్రజలు అవాక్కయిపోతున్నారు. మెుదటగా ప్రమాదం ఎలా జరిగింది. ఏ రైలును ఏరైలు ఢీకొట్టింది.. అని ప్రజలు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఆ 20 నిమిషాలు ఏం జరిగి ఉంటుందని.. ఎందుకీ గందరగోళవ అనే సందేహాలు ప్రతి ఒక్కరిలో వ్యక్తం అవుతున్నాయి. అలాగే ప్రమాదం జరిగిన తర్వాతనే రైళ్లు ఢీకొన్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి కానీ.. మెుదటగా ప్రమాదం ఎలా జరిగింది. అలాగే మూడు రైళ్లు ఢీకొనడం లో మధ్య ఏమైన సమయం ఉందా.. ఎందుకు రైల్వే అదికారులకు సమాచారం అందలేదు అన్నది అంతు చిక్కని ప్రశ్నలుగా మారాయి. ప్రాథమిక సమాచారం.. రైల్వే బాధితులు, రైల్వే సిబ్బంది, అదికారులు చెబుతున్న మాటలు ఇలా ఉన్నాయి.

పశ్చిమబెంగాల్ షాలిమార్ నుంచి చెన్త్నె వెళుతున్న కోరమాండల్ ఎక్స్ ప్రెస్ రైలు 2023, జూన్ 2వ తేదీ మధ్యాహ్నం 3 గంటల 20 నిమిషాలకు అక్కడ షాలిమార్ రైల్వే స్టేషన్ లో బయలుదేరి.. తిరిగి ఆరున్నర గంటలకు బాలాసోర్ చేరుకుంది. మళ్లీ అక్కడి నుంచి బయలుదేరిన ఈ రైలు బాలేశ్వర్ దగ్గరకు రాగానే.. రైళ్లు పట్టాలు తప్పి పక్క ట్రాక్ పై ఆగి ఉన్న గూడ్స్ రైలును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కోరమాండల్ కు చెందిన 12 బోగీలు చెల్లాచెదురుగా అయి పక్కనే ఉన్న మూడో రైల్వే ట్రాక్ పై కొన్ని బోగీలు పడ్డాయి. ఈ ప్రమాదం 6 గంటల 50 నిమిషాలకు ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు అధికారులు. ఆ తర్వాత 15 నిమిషాలకు అంటే.. 7 గంటల 15 నిమిషాల సమయంలో బెంగుళూరు నుంచా హౌరా వెళుతున్న యశ్వంత్ పూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలపై పడిపోయిన కోరమాండల్ ఎక్స్ ప్రెస్ రైలు బోగీలను యశ్వంత్ పూర్ ఎక్స్ ప్రెస్ రైలు 100 కిలోమీటర్ల వేగంతో బోగీలను ఢీ కొట్టడంతో కోరమాండల్ బోగీలు డీకొట్టగా అక్కడిక్కడే తలకిందులు అయ్యి.. నుజ్జు నుజ్జు అయ్యాయి. దీంతో ప్రమాద తీవ్రత పెరిగి.. ఎక్కువ మంది చనిపోవడానికి కారణం అయ్యిందని ప్రాథమిక అంచనాగా వేసారు.

ఇక్కడ ఓ విషయం అంతు చిక్కటం లేదు. ఎందుకంటే కోరమాండల్ ఎక్స్ ప్రెస్..యశ్వంత్ పూర్ ఎక్స్ ప్రెస్ రెండు రైళ్లు సూపర్ ఫాస్ట్ అని.. వీటి వేగం గరిష్టంగా 100 నుంచి 130 కిలోమీటర్ల స్పీడ్ వేగంలో ఉంటుంది. కోరమాండల్ ప్రమాదం జరిగిన వెంటనే రైల్వే అధికారలు ఎందుకు గమనించలేకపోయారు అనేది ఓ పాయింట్ అయితే.. రావాల్సి రైలు స్టేషన్ దాటకపోయినా స్టేషన్ అధికారులు ఎందుకు గుర్తించలేకపోయారు అనేది మరో పాయింట్. సహజంగా ఇలాంటి సూపర్ ఫాస్ట్ రైళ్లు స్టేషన్ నుంచి మరో స్టేషన్ ను 5 నుంచి 8 నిమిషాల్లోనే దాటేస్తాయి. అలాంటిది యశ్వంత్ పూర్ ఎక్స్ ప్రెస్ రైలు వచ్చి ఢీకొనటానికి మధ్య గ్యాప్ 15 నిమిషాలు ఉన్నా.. అక్కడ సమీపంలోని రైల్వే స్టేషన్ లోని అధికారులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదు అంతుచిక్కటం లేదు.

కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ప్రమాదం జరిగిన వెంటనే.. ఆ రైలు వెనుక ఉండే సమాచారం ఇచ్చారా లేదా అనే దానిపై క్లారిటీ అయితే రావడం లేదా. కోరమాండల్ ఎక్సె్ ప్రెస్ లోనా గార్డ్ ప్రమాదం జరిగిన తర్వాత మిగతా ట్రాక్ పై వస్తున్నా యశ్వంపూర్ రైలుకు.. తన దగ్గర వచ్చేవరకు కూడా ఎర్రజెండాతో ఎందుకు అలర్ట్ చేయలేదని.. అదేవిధంగా రాత్రి అయ్యేసరికి గార్డ్ దగ్గర రెడ్ అండ్ గ్రీన్ లైట్స్ సహజంగానే ఉంటాయి. కదా అని ఇలాంటి ప్రశ్నలే చాలా తలెత్తున్నాయి.అలాగే నాలుగు ట్రాకులు.. మూడు రైళ్లు.. రాత్రి 6 గంటల 50 నిమిషాల నుంచి అదే విధంగా 7 గంటల 10 నిమిషాలు మధ్యలో ఆ 20 నిమిషాలు ఏం జరిగిందని.. సిగ్నలింగ్ వ్యవస్థ ఏమైనా ఫెయిల్ అయ్యిందా లేక ఇతర ఏమైనా కారణాలు ఉన్నాయా అని విచారణలో తేలాల్సి ఉందని తెలియజేసారు.

Show comments
SHARE THIS ARTICLE ON
Read Today's Latest newsNewsTelugu News LIVE Updates on SumanTV

Most viewed