స్పెషల్ డెస్క్- భిమ్లా నాయక్.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్ గ్లింప్ మరియు పాట దుమ్ము రేపుతున్నాయి. ప్రధానంగా భిమ్లా నాయక్ టైటిల్ సాంగ్ యూట్యూబ్ లో రికార్డులను తిరగరాస్తోంది. అతి తక్కువ సమయంలో అత్యధిక లైక్స్ సాధించిన పాటగా భిమ్లా నాయక్ పాట రికార్డ్ క్రియేట్ చేసింది.
ఇక భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ పాడిన కిన్నెల కిన్నెర మొగులయ్యా ఇప్పుడు బాగా పాపులర్ అయ్యారు. జానపద కళాకారుడైన కిన్నెర మొగులయ్యకు భిమ్లా నాయక్ పాటతో ఒక్కసారిగా క్రేజ్ పెరిగిపోయింది. ఇప్పుడు అంతా ఎవరు ఈ కిన్నెర మొగులయ్య అని గూగుల్ లో వెతుకుతున్నారు. భిమ్లా నాయక్ సినిమాలోని కిన్నెర మొగులయ్య పాటకు ఏకంగా పవన్ కళ్యాణ్ సైతం ఫిదా అయిపోయారు.
ఇక ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వూలో కిన్నెర మొగులయ్య తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై పాట పాడారు. తానే స్వయంగా కేసీఆర్ పై రాసిన పాటను పాడి వినిపించారు. కేసీఆర్ తెలంగాణ ఉద్యమం చేసినప్పటి నుంచి మొదలు ప్రస్తుత పాలన వరకు పలు ఘట్టాలపై పాట రూపంలో పాడారు కిన్నెర మొగులయ్యా. కేసీఆర్ తెలంగాణ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి నిమ్మరసం తాగిన ఘటనతో పాట ప్రారంభించారు మొగలయ్య.
ఇక ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేస్తున్న పధకాలను పాటలో ప్రస్తావించారు కిన్నెర మొగులయ్య. ప్రధానంగా ఆసరా ఫించన్లు, కళ్యాణ లక్ష్మి పధకం వంటి వాటిని తన పాట ద్వార గుర్తు చేశారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ తో కేసీఆర్ ను పోల్చిన మొగులయ్య.. ఇక కేసీఆర్ కు తిరుగు లేదని పాట పాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అంటూ కిన్నెర మొగులయ్య పాడిన పాటకు అంతా ఫిదా అవుతున్నారు.