అగ్రశ్రేణి దర్శకుల్లో మొదటివరుసలో ఉండే దర్శకుడు శంకర్ ..ఆయన సినిమా అంటే ఆషా మాషీ వ్యవహారం కాదు .ఆ టేకింగ్ కానీ స్టొరీ కానీ ఒక లెవల్లో ఉంటాయన్న విషయం అందరికి తెలిసిందే .అలాగే హీరో ,హీరోయిన్ విషయం లో కూడా అంతకు మించిన రేంజ్ లో ఉంటుంది వ్యవహారం.సినిమా భారీగా నిర్మించడంతోపాటు సినిమా కలెక్షన్ విషయం లో కానీ నిర్మాతలకు కాసుల కనక వర్షం కురిపించడం లోనూ అదే లెవెల్ లో ఉంటుంది. చాలా ఆలోచిస్తే గానీ ఒక నిర్ణయాన్ని తీసుకోరు .
ఇండియాలోనే టాప్ డైరెక్టర్ శంకర్, మెగా పవర్ స్టార్ కాంబినేషన్ లో ఓ భారీ పాన్ ఇండియా మూవీని అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. “ఆర్సి15” అనే వర్కింగ్ టైటిల్ తో పిలుస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ విషయమై సినిమా అధికారికంగా ప్రకటించినప్పటి నుంచి సస్పెన్స్ నెలకొన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ ను అధికారికంగా ప్రకటించారు. చరణ్ సరసన బాలీవుడ్ నటి కియారా అద్వానీని హీరోయిన్‌గా ఎంపిక చేశారు.
“వినయ విధేయ రామ” తర్వాత రామ్ చరణ్ తో ఆమె నటిస్తున్న రెండో సినిమా ఇది. ఈ ప్రకటన రాకముందు మూవీలో చరణ్ రొమాన్స్ చేయబోయే హీరోయిన్లు వీళ్ళేనంటూ చాలామంది టాప్ హీరోయిన్ల పేర్లు విన్పించాయి.ఆ జాబితాలో కియారా, అలియా భట్, రశ్మిక మండన్న ఉన్నారు. ఇక కియారా విషయానికొస్తే తెలుగులో ఆమె చివరగా “వినయ విధేయ రామ”లో కన్పించింది. “భరత్ అనే నేను”తో కియారా తన కెరీర్‌లో మొదటి విజయాన్ని సాధించింది.
కియారా కి బాలీవుడ్‌లో కూడా మంచి ఆఫర్లను అందుకుంది. మరోవైపు “ఆర్సీ 15″కు సంబంధించిన పనులను వేగవంతం చేశారు మేకర్స్. ఇప్పటివరకు దర్శకుడు శంకర్ తమన్ ను సంగీత దర్శకుడుగా, జానీ మాస్టర్ ను కొరియోగ్రాఫర్ గా, సాయి మాధవ్ బుర్రాను డైలాగ్ రైటర్ గా అఫీషియల్ గా నిర్ధారించారు. “ఆర్సి 15” ఆగస్టులో అధికారికంగా ప్రారంభించబడుతుంది.ఈ మూవీ చూడటం కోసం ఎదురుచూద్దాం ..అద్భుత విజయాన్ని చేకూర్చాలని ఆశిద్దాం !