కరోనా.. ఈ ఒక్క మాట ప్రపంచదేశాలని వణికిస్తోంది. ఈ మహమ్మారి దెబ్బకి ప్రజలంతా వణికిపోతున్న సమయంలో కూడా ఫ్రెంట్ లైన్ వారియర్స్ దైర్యంగా ముందుకి వచ్చారు. సమాజానికి ఎంతో అవసరమైన తమ విధులను, సేవలను ఆపకుండా మానవత్వం చాటుకున్నారు. ఈ క్రమంలో ఎంతో మంది ఫ్రెంట్ లైన్ వారియర్స్ ప్రాణాలను సైతం కోల్పోయారు. కానీ.. ఇప్పుడు మనం తెలుసుకోబోయేది ఓ విజేత కథ. ఫ్రెంట్ లైన్ వారియర్ గా క్లిష్ట సమయంలో సైతం తన విధులకు హాజరై.. కరోనా మహమ్మారి కోరల్లో చిక్కి, ఆరు నెలలపాటు కరోనాతో పోరాడి.. చివరికి సంపూర్ణ ఆరోగ్యంతో పాటు రూ.50 లక్షల రివార్డుని అందుకున్న ఓ నిజమైన విజేత కథ. ఆ వివరాల్లోకి వెళ్తే..
కేరళకు చెందిన అరుణ్ కుమార్ కథ ఇది. అరుణ్ కి అబుదాబిలోని ఓ ఆస్పత్రిలో పని. కరోనా సమయంలో పేషంట్స్ తో హాస్పిటల్ కిక్కరిసిపోయింది. కానీ.. అరుణ్ భయపడలేదు. వైరస్ బాధితులకి అండగా నిలిచాడు. దీంతో.. అరుణ్ కి కూడా కరోనా వచ్చింది. చూస్తుండగానే పరిస్థితి తీవ్రం అయ్యింది. ఊపిరి కూడా తీసుకోవడానికి ఇబ్బంది పడే స్థితిలో హాస్పిటల్ లో జాయిన్ అయ్యాడు. తన చుట్టూ ఉన్న పేషంట్స్ కి కరోనా తగ్గినా.. అరుణ్ ని మాత్రం ఆ మహమ్మారి అంత సులభంగా వదలలేదు. పట్టి పీడించింది. 6 నెలల పాటు నరకం చూపించింది.
రోజురోజుకి ఆరోగ్యం క్షీణిస్తున్నా అరుణ్ కుమార్ నమ్మకం కోల్పోలేదు. అధైర్య పడలేదు. నెలల తరబడి ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నాడు. ఎట్టకేలకు వైద్యల ట్రీట్ మెంట్ కు ఆయన శరీరం స్పందించింది. చివరకు ఆరు నెలల తర్వాత అరుణ్ కుమార్ కరోనా వైరస్ నుండి పూర్తిగా కోలుకున్నాడు. అయితే.. విధి నిర్వహణలో అరుణ్ కి కరోనా సోకడం, ఆరు నెలల పాటు దైర్యంగా మహమ్మారితో పోరాడి ప్రాణాలు దక్కించుకోవడంతో ఆక్కడి ప్రభుత్వం అరుణ్ కుమార్ కి రూ.50 లక్షల రివార్డు ప్రకటించింది. ప్రభుత్వం ఇంత పెద్ద మొత్తంలో రివార్డ్ అందించడంతో అరుణ్ కుమార్, అతని కుటుంబ సభ్యులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. చూశారు కదా.. జీవితంలో దైర్యంగా పోరాడితే ఎలా ఫలాలను అందుకోవచ్చో? మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.