పట్టుపడితే సాధించేదాక వదలరూ సీఎం కేసీఆర్. ఆయన ఏది చేసిన అది అంతకు ముందు అనితరసాధ్యమనే భావన ఉంటుంది. 14 ఏళ్లు ముందుడి పోరాడి సాధించిన తెలంగాణ రాష్ట్రామే అందుకు చక్కటి ఉదాహరణ. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణను సాధించి తొలి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. 2018లో ముందస్తు ఎన్నికలకు వచ్చి తెలంగాణ సీఎంగా రెండో సారి ఎన్నికయ్యారు. ఇప్పుడు ఆయన ఉప రాష్ట్రపతి పదవి కోసం పావులు కదుపుతున్నట్లు సమాచారం.అందుకే ఢిల్లీలో పర్యటించి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పెద్దలు అమిత్ షా, జేపీ నడ్డాతో భేటీ అయ్యారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు బీజేపీకి అస్సలు పడ్డం లేదు. రెండు పార్టీలు సై అంటే సై అంటున్నాయి. అటు వైపు కాంగ్రెస్ కూడా తగ్గడం లేదు. దీంతో పాటు ఆయన వయసు, ఆరోగ్యం, రాజకీయ పరిస్థితులను పరిగణంలోకి తీసుకుని బీజేపీతో దోస్తీ చేసేందుకు ఢిల్లీలో చక్రం తిప్పుతున్నట్లు తెలుస్తుంది.కేటీఆర్‌ను సీఎం చేయాలి.. ఎలా?
కేసీఆర్ తర్వాత టీఆర్‌ఎస్‌ను నడిపించేది. అధికారంలో ఉంటే ముఖ్యమంత్రి పీఠం అధిరోహించేది ఆయన తనయుడు, మంత్రి కేటీఆరే అని అందరికీ తెలిసిన నిజం. వాస్తవానికి 2018 తర్వాత రెండో సారి టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడితే కేటీఆర్ సీఎంగా ఉంటారనే ఊహాగానాలు భారీగా వచ్చాయి. కానీ అలా జరగలేదు. ఇప్పుడు పరిస్థితి మారింది. అందుకే కేటీఆర్‌ను సీఎంను చేసి తాను ఉప రాష్ట్రపతి, తర్వాత కుదిరితే రాష్ట్రపతి అవ్వాలనే పక్కా ప్లాన్‌తో కేసీఆర్ బీజేపీతో దోస్తీకి చేయి చాచుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బీజేపీతో కలిసి ఎన్డీయే కూటమిలో చేరిపోతే తాను అనుకున్న విధంగా ఉప రాష్ట్రపతి పదవి అధిరోహించవచ్చు. దాంతో పాటు రాష్ట్రంలో బీజేపీ పోరుకు అడ్డుకట్ట పడుతుందని కేటీఆర్ భావిస్తున్నట్లు సమాచారం.
మరీ హరీష్‌రావు సంగతి ఏంటి?కేటీఆర్ సీఎం అయితే హరీష్‌రావు వేరే కుంపటి పెట్టుకుంటారు అనే అనుమానాలు, అంచనాలు ఉన్నాయి. అలా జరిగితే టీఆర్‌ఎస్‌కు తీవ్ర నష్టం కలుగుతుంది. పార్టీ రెండు ముక్కలు అవుతుంది. ఇప్పటికే హరిష్‌రావుకు ఇవ్వాల్సినంత ప్రాధాన్యత దక్కడం లేదనే విమర్శలు కూడా టీఆర్‌ఎస్ వర్గాల్లో అంతర్గతంగా ఉన్నట్లు తెలుస్తుంది. టీఆర్‌ఎస్ నుంచి హరీష్ బయటికి వచ్చేస్తారనే పుకార్లు ఆ మధ్య చాలానే వచ్చాయి. అందుకే అలా జరగకుండా ఉండేందుకు హరీష్‌ను కేంద్ర మంత్రిని చేయాలనే ప్లాన్‌లో కేసీఆర్ ఉన్నట్లు సమాచారం.
బీజేపీతో దోస్తీ చేసి ఉప రాష్ట్రపతి పదవితో పాటు మూడు కేంద్ర మంత్రి పదవులు పొందేలా బీజేపీ పెద్దలతో కేసీఆర్ మంతనాలు జరుపుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మరీ కేసీఆర్ ఉప రాష్ట్రపతి పదవి కోసం జరిపే ప్రయత్నాలు, కేటీఆర్ సీఎం అవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: హరీశ్‌రావు.. నేను ఎన్ని బాధలు పడ్డానో నీకు తెలియదా: మాజీ మంత్రి ఈటల