ఫిల్మ్ డెస్క్- బాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, అందాల ముద్దగుమ్మ కత్రినా కైఫ్ ఎట్టకేలకు వివాహ బంధంలోకి అడగుపెట్టింది. అవును బాలీవుడ్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న లవ్ బర్డ్స్ కత్రినా కైఫ్, వీక్కీ కౌశల్ అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. నవంబర్ 9 గురువారం అగ్ని సాక్షిగా ఏడడుగులు వేసి అధికారికంగా భార్యభర్తలు అయిపోయారు.
రాజస్థాన్ లోని సవాయ్ మాధోపూర్ లోని విలాసవంతమైన హోటల్ సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బార్వారాలో కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ పెళ్లి వేడుక అట్టహాసంగా జరిగింది. వివాహ వేడుక తరువాక వీరి రిసెప్షన్‌ను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఐతే వీరి పెళ్లికి సంబందించిన ఫోటోలు ఎవరు తీయకుండా కఠినమైన ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. అందుకే పెళ్లికి వచ్చిన అతిధుల ఫోన్లు కూడా వివాహ వేదికకు అనుమతించలేదు.
ఐతే కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ పెళ్లికి సంబంధించిన తొలి ఫోటో సోషల్ తాజాగా మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనిని ఓ ఫ్యాన్ పేజ్ ఫోటోను పోస్టు చేసింది. ఇందులో కోటపై భార్యభర్తలుగా నిల్చున్న కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ చాలా అందంగా, ఎంతో సంతోషంగా కనిపిస్తున్నారు. ఇక వీరి పెళ్లికి బాలీవుడ్ నుంచి ఎవరెవరు అతిధులు హాజరయ్యారన్నది కూడా ఆసక్తికరంగా మారింది.
పెళ్లికి సంబంగించిన పూర్తి ఫోటోలు, వీడియో బయటకు వస్తే గానీ పెళ్లికి హాజరైన వారి వివరాలు తెలిసే అవకాశం లేదు. కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ పెళ్లి వీడియో, ఫోటో రైట్స్ ను ఓ ఓటీటీ సంస్థకు భారీ మొత్తానికి అమ్మేశారని ప్రచారం జరుగుతోంది. అదే గనుక నిజమైతే కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ పెళ్లి వేడుకను మనం సదరు ఓటీటీలో చూడాల్సందే మరి.