కరోనా కష్ట కాలంలో సినీ పరిశ్రమ కోలుకోలేని దెబ్బ తిన్న విషయం తెలిసిందే. ఇక ఇదే సమయంలో ఇండస్ట్రీ లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా.., ఇలాంటి విచారకరమైన సంఘటన మరొకటి జరిగింది. ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్, నటుడు కత్తి మహేశ్ కు యాసిడెంట్ అయ్యింది. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారు.. లారీని ఢీ కొట్టింది. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో కత్తి మహేశ్‌కు స్వల్ప గాయాలయ్యాయి. నెల్లూరులోని మెడికేర్ ఆస్పత్రికి కత్తి మహేశ్‌ని తరలించి వైద్యం అందిస్తున్నారు.
ఈ యాక్సిడెంట్ లో కత్తి మహేశ్ కారు నుజ్జు, నుజ్జు అయ్యింది. అందుతున్న ప్రాధమిక సమాచారం ప్రకారం అయితే కత్తి మహేశ్ ప్రాణానికి ప్రమాదం లేదని తెలుస్తోంది. కాకుంటే.., ఈ ఘటనతో ఆయన పూర్తి షాక్ లోకి వెళ్లారని, కోలుకోవడానికి కాస్త సమయం పడుతుందని వైద్యులు తెలియచేశారు. ఈ ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఫిల్మ్ జర్నలిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసిన కత్తి మహేశ్ ఆ తరువాత క్రిటిక్ గా సూపర్ సక్సెస్ అయ్యాడు. ఆ తరువాత కాలంలో పవన్ కల్యాణ్‌పై విమర్శలు, వివాదాస్పద పోస్తులలో చాలా పాపులర్ అయ్యాడు. ఇక గతంలో హిందూ దేవుళ్ళపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు కత్తి మహేశ్ నగర బహిష్కరణకు కూడా గురయ్యాడు. ఏదేమైనా.. కత్తి మహేశ్ కి పెను ప్రమాదం తప్పడంతో ఆయన కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు పోలీసులు ఈ యాక్సిడెంట్ పై కేసు నమోదు చేసుకుని విచారణ మొదలు పెట్టినట్టు తెలుస్తోంది.