కర్ణాటక క్రైం- ప్రేమ, అక్రమ సంబంధాల మోజులో పడి చాలా మంది ఆత్మహత్యలు చేసుకోవడమే కాదు, ఏకంగా హత్యలు చేస్తున్నారు. తమ సంబంధాన్ని ఎక్కడ బయటపెడతారనో, తమ అక్రమ బంధానికి అడ్డు వస్తున్నారనో సొంత వారినే కడతేరుస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి దారుణాలు బాగా పెరిగిపోయాయి.
తాజాగా కర్ణాటక రాష్ట్రంలో ఇలాంటి హత్య వెలుగులోకి వచ్చింది. తమ ప్రేమకు అడ్డుగా ఉందని ఓ కూతురు కన్నతల్లిని ప్రియునితో కలిసి దారుణంగా హత్య చేసింది. ఈ ఘటన స్ఠానికంగా కలకలం రేపుతోంది. కర్ణాటక రాష్ట్రంలోని కొరటిగెరె పట్టణంలోని సజ్జనర వీధిలో నివాసం ఉంటున్న 45 ఏళ్ల సుమిత్ర నివాసం ఉంటోంది. సుమిత్రకు పెళ్లికాని కూతురు శైలజ ఉంది.
సుమిత్ర ఇంటికి దూరపు బంధువు పునీత్ వచ్చిపోయేవాడు. అతడు శైలజకు సోదరుడి వరుస అవుతాడు. ఈ క్రమంలో శైలజకు, పునీత్‌తో పరిచయం ఏర్పడి అక్రమ సంబంధంగా మారింది. ఈ విషయం పసిగట్టిన సుమిత్ర పునీత్ ను తమ ఇంటికి గాని, తన కూతురు జోలికి గాని రావద్దని సీరియస్ గా వార్నింగ్ ఇచ్చింది.
ఇంకేముంది తమ బంధానికి తల్లి అడ్డొస్తోందని భావించిన కూతురు శైలజ ఆమెను అంతమొందించాలని డిసైడ్ అయ్యింది. ప్రియుడు పునీత్ తో కలిసి జనవరి 30న రాత్రి పధకం ప్రకారం తల్లిని గొంతు పిసికి చంపి, ఆమె శవాన్ని ఇంటి ముందున్న సంపులో పడేశారు.
తెల్లారి అనుకోకుండా తల్లి సంపులో పడి చనిపోయిందని అందరినీ నమ్మించారు. హడావుడిగా అంత్యక్రియలు కూడా జరిపించారు. ఐతే బంధువుల్లో కొందరికి అనుమానం రావడంతో కొరటిగెరె పోలీసులకు పిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు తమదైన స్టైల్లో విచారణ జరపగా శైలజ, పునీత్ లు నిజం ఒప్పుకోకతప్పలేదు.