ప్రస్తుతం సమాజంలో జరిగే కొన్ని సంఘటనలు చూస్తే.. పెళ్లి చేయాలన్నా.. చేసుకోవాలన్నా భయపడాల్సి వస్తుంది. కొన్నేళ్ల క్రితం వరకు ప్రేమించకపోతే యువతులపై దాడులు జరిగేవి. కానీ ఇప్పుడు కాలం మారింది. ప్రేమించిన వాడి కోసం ఏకంగా యువతులు, వివాహిత మహిళలు.. ఎంతటి దారుణాలకు పాల్పడాటానికి అయినా రెడీ అవుతున్నారు. భర్త, ప్రియుడిని అడ్డు తొలగించుకోవడం కోసం హత్యలు కూడా చేస్తున్నారు. ఇక కొందరైతే.. పెళ్లికి రోజులు ముందు నచ్చినవాడితో వెళ్లిపోతున్నారు. ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి తాజాగా వెలుగు చూసింది. అప్పటికే ఆ యువతికి కుటుంబ సభ్యులు వివాహం నిశ్చయం చేసి.. ఎంగేజ్‌మెంట్ కూడా చేశారు. మరికొద్ది రోజుల్లో పెళ్లి. ఇలా ఉండగా.. సదరు యువతి.. ప్రేమించిన వాడితో వెళ్లి పోయి వివామం చేసుకుని తల్లిదండ్రులకు షాకిచ్చింది.
ఈ సంఘటన కర్ణాటక, రాయచూరు జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాకు చెందిన భారతి అనే యువతికి తల్లిదండ్రులు కొన్నాళ్ల క్రితం విజయనగర జిల్లా.. హువినహడగలికి చెందిన యువకుడితో వివాహం నిశ్చయించి.. కొన్ని రోజుల క్రితమే నిశ్చితార్థం కూడా చేశారు. మరి కొద్ది రోజుల్లో భారతి వివాహం జరగనుంది. ఇలా ఉండగా.. మూడు రోజుల కిందట భారతి ఇంటి నుంచి వెళ్లిపోయింది. దాంతో తల్లిదండ్రులు.. తమ కుమార్తె భారతి కనపడటం లేదని వారు.. నేతాజీ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న భారతి పోలీసు స్టేషన్‌కు వచ్చింది.
అయితే భారతి బుర్ఖాలో రావడం చూసి ఆమె తల్లిదండ్రులు షాక్ అయ్యారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చిన భారతి.. తాను రెహాన్‌ను వివాహం చేసుకున్నానని పోలీసులకు తెలిపింది. ఇంతకు రెహాన్ ఎవరంటే.. భారతి వాళ్ల ఒంటి దగ్గర పూల వ్యాపారం చేసేవాడు. భారతి అతడి షాపులోకి పనికి వెళ్లేది. ఈ క్రమంలో వారు ప్రేమించుకున్నారు. కానీ ఇంతలో భారతి కుటుంబ సభ్యులు ఆమెకు వివాహం నిశ్చయం చేయడంతో.. రెహాన్- భారతి హైదరాబాద్ వచ్చి వివాహం చేసుకున్నారు.
కానీ భారతి తల్లిదండ్రులు మాత్రం.. రెహాన్ తన కుమార్తెకి మాయ మాటలు చెప్పి.. నమ్మించి మోసం చేసి ఈ పెళ్లి చేసుకున్నాడని.. ఆరోపించారు. పైగా వివాహం కాగానే భారతి చేత మతం మార్పించాడని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ భారతి మాత్రం.. తామిద్దరూ ప్రేమించి వివాహం చేసుకున్నామని.. ఇందులో ఎవరి బలవంతం లేదని చెప్పడంతో.. పోలీసులు ఆ జంటను విచారించి పంపించేశారు.