కర్ణాటక ఎన్నికల పోలింగ్ కేవలం కొన్ని గంటల మాత్రమే ఉంది. 10 పోలింగ్ జరగనుండగా.. 13న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. అన్ని పార్టీల నాయకులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు మే 10న జరుగనున్న సంగతి తెలిసిందే. ఎన్నికల పోలింగ్ కేవలం కొన్ని మాత్రమే ఉంది. ఎన్నికలకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మే 10న ఎన్నికలు జరగనుండగా.. మే13న కౌంటింగ్, ఫలితాలు వెలువడనున్నాయి. ఇక, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చాలా రసవత్తరంగా సాగింది. నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించుకున్నారు. వాడి వేడి చర్చలతో విస్తృత సమావేశాలు, స్పీచ్‌లతో దంచికొట్టారు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు రాజకీయ పార్టీల నాయకులు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఓటర్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ హామీల వర్షం కురిపించారు.
ప్రజలకు మందు, డబ్బులు విచ్చలవిడిగా సరఫరా చేస్తున్నారు. ఎన్నికల సంఘం అధికారులు చేసిన సోదాల్లో మద్యం, డ్రగ్స్, నగదు, వస్తువులు భారీగా పట్టుబడ్డాయి. చాలాచోట్ల మద్యం ఏరులై పారింది. మద్యంతో పాటుగా నగదును కూడా అధికారులు పట్టుకున్నారు. ఇప్పటివరకు అధికారులు రూ. 147.46 కోట్ల నగదును పట్టుకున్నారు. నగదులో పాటు రూ.83.66కోట్ల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. నగదు, డబ్బుతో పాటు రూ.23.67 కోట్ల విలువైన డ్రగ్స్ కూడా పట్టుబడటం గమనార్హం. ఇక, ఉచితంగా పంపిణీ చేసిన వస్తువుల విలువ రూ.24.21 కోట్లుగా ఉంది. అధికారులు మొత్తం రూ. 375.61 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో పెట్టిన ఖర్చుతో పెట్టిన దానితో పోల్చితే ఈ ఎన్నికల్లో నాలుగు రెట్లు ఖర్చు పెడుతున్నారు.