తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇక నుంచి వారికి రూ. 10 లక్షల వరకూ ఆర్థిక సహాయాన్ని అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైనట్లు మంత్రి హరీష్ రావు వెల్లడించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టంది. అందులో రైతులకు రైతుబీమా పథకం కూడా ఒకటి. ఏ కారణం చేతనైనా రైతు చనిపోతే, నామినీకి LIC నుండి 10 రోజుల్లో రూ. 5లక్షల రైతుబీమా పరిహారం ప్రభుత్వం తరపున అందిస్తారు. అదే తరహాలో తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో పథకం కార్మికుల కొరకు అందించనుందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్‌రావు తెలిపారు. సిద్ధిపేట నియోజకవర్గంలో 300 మంది బీసీలకు రూ. లక్ష ఆర్థిక సాయం చెక్కులను కలెక్టర్ ప్రశాంత్‌జీవన్ పాటిల్, జడ్పీ ఛైర్‌పర్సన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, తదితరులతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కార్మిక, వైద్యారోగ్యశాఖల మధ్య ఒప్పందం కుదిరిందని, దాని ప్రకారం కార్మికులకు రూ. 5లక్షల వరకు ఉచిత వైద్య సేవలను అందించనున్నట్లు వివరించారు. మరిన్ని వివరాల్లోకి వెళితే..
ఆరోగ్యశ్రీ తో ఈ సేవలను ప్రైవేట్, ప్రభుత్వ ఆస్పత్రుల్లో వినియోగించుకోవచ్చని తెలిపారు. గుండె, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు రూ. 10 లక్షల వరకు బీమా వర్తిస్తుందని తెలిపారు. ఈ సేవలు ఆగస్టు 1 నుంచి అమలులోకి వస్తాయని వెల్లడించారు. డిజిటల్ కార్డులు రూపొందించేందుకు స్పెషల్ డ్రైవ్ చేపడగామని పేర్కొన్నారు. దీని గురించి కార్మిక మంత్రి మల్లారెడ్డి, కార్మికశాఖ కమిషనర్ రాణీకౌముడితో హరీశ్ రావు మాట్లాడారు. మార్గదర్శకాలకు అనుగుణంగా ఓ ఏజెన్సీ ద్వారా సభ్యత్వం పొందిన కార్మికుడి వేలిముద్రలను సేకరించి, నామినీ వివరాలు నమోదు చేయాల్సి ఉంటుదని తెలపారు. ఒక్కసారి డిజిటల్ కార్డ్ చేసుకుంటే ఐదేండ్ల వరకు ఉండేదని.. కానీ ఇప్పుడు పదేండ్లకు పెంచిందని తెలిపారు.
ఇంతకు ముందు భవన నిర్మాణ కార్మికుడి బీమా రూ. లక్షన్నర ఉండగా రూ. 3లక్షలకు పెంచడానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చస్తానని తెలిపారు. కార్మిక మంత్రి మల్లారెడ్డి ఫోన్‌లో మాట్లాడుతూ.. మంత్రి హరీశ్‌రావు సూచనల మేరకు జిల్లాకో కార్మిక భవనం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. కుల వృత్తులను బలోపేతం చేసేందుకు రూ. లక్ష ఆర్థిక సాయంగా అందించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. దశల వారిగా అర్హులైన వారందరికీ రూ. లక్ష అందిస్తామని పేర్కొన్నారు. దేశంలో అనేక రాష్ట్రాలకు చేపలను ఎగుమతి చేస్తున్నట్లు.. చేపలకు బాగా డిమాండ్ ఉందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేప పిల్లలను సబ్సిడీపై ఉచితంగా అందిస్తుండడంతో నీలివిప్లవం సాకారమైంది. చెరువులు, వాగులు, రిజర్వాయర్ల వద్ద ఎక్కడ చూసినా చేపలే కనబుతున్నాయని మంత్రి తెలిపారు.