బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ మరో పవర్‌ఫుల్ పాత్రలో గ్రాండ్ పీరియాడిక్, పొలిటికల్ డ్రామాగా భారీ బడ్జెట్‌తో నటించేందుకు సిద్ధమవుతున్నారు. భారతదేశ దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో తాను నటించ బోతున్నట్లు కంగనా ప్రకటించింది. ఇప్పటికే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత బయోపిక్ ‘తలైవి’లో నటించింది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘ఎమర్జెన్సీ’ చిత్రంలో ఇందిరా గాంధీ పాత్రలో ఆమె నటించనున్నారు. ఈ సినిమాకు సంబంధించి తన లుక్, మేకోవర్ పనులను కంగనా మొదలుపెట్టింది. ఇందిరా గాంధీ లుక్ కోసం మేకప్ చేయించుకుంటున్న ఫోటోలను షేర్ చేసింది. ప్రతి కొత్త పాత్ర కోసం అందమైన ఆరంభం ఎంతో మంచి అద్భుతమైన ఆర్టిస్టులతో ‘ఎమర్జెన్సీ’ ప్రయాణం మొదలుపెట్టినట్లు కంగనా చెప్పుకొచ్చింది.
ఇది ఇందిరా గాంధీ బయోపిక్ కాదని, ఇదొక పొలిటికల్ డ్రామా అని, ఇప్పటి జనరేషన్‌కి అర్థమయ్యే విధంగా ఉండనుందని కంగనా అన్నారు. ఒక పుస్తకం ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతోందన్న కంగనా ఆ బుక్ పేరును మాత్రం చెప్పలేదు. సాయి కబీర్ ఈ మూవీకి దర్శకత్వం వహించనున్నాడని మణికర్ణిక ఫిలింస్ ఈ చిత్రాన్ని నిర్మించనుందని కంగనా తెలిపింది. ఇది బయోపిక్ కాదట. కేవలం ఎమర్జెన్సీ సమయంలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కనుందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.