ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కచ్చా బాదం మేనియానే. దేశ విదేశాల్లో అంతా కచ్చా బాదం అంటూ రాగాలు తీస్తూ స్టెప్పులేస్తున్నారు. పాట అర్థం తెలియకపోయినా, భాష అర్థం కాకపోయినా అందరి నోటా కచ్చా బాదం అన్న మాట నానుతూనే ఉంది. పశ్చిమ బెంగాల్ కు చెందిన భుబన్ బద్యాకర్ తలరాతని మార్చి, ఇప్పుడు అందరినీ ఒక ఊపు ఊపేస్తోంది ఈ “కచ్చా బాదం”. పల్లీలు అమ్ముకునే ఓ సాధారణ వ్యాపారి గొంతుకుకి ప్రపంచం అంతా దాసోహం అయ్యింది. ఆ పాటతో భుబన్ కు పెరిగిన ఫ్యాన్ పాలోయింగ్ చూశాం. ఆ ఫేమ్ ను ఇప్పుడు రాజకీయ నాయకులు కూడా క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు. తాజాగా భుబన్ బద్యాకర్ కచ్చాబాదం పాట పాడుతూ కాంగ్రెస్ తరఫున ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.