ఇంటర్నేషనల్ డెస్క్- ఉద్యోగం అంటే ఎంత కష్టమో చేసే వారికే తెలుస్తుంది. చిన్న, పెద్ద ఉద్యోగం.. ఇదైనా ఎంతో కొంత కష్టపడాల్సిందే. కష్టపడందే ఏదీ ఊరికే రాదు. కానీ ఊరికే అలా వీడియోలు చూస్తూ ఉండే ఉద్యోగమైతే.. అందుకు మంచి జీతం కూడా ఇస్తామంటే.. ఎవరైనా ఎగిరి గంతేసి ఆ ఉద్యోగం చేసేందుకు సిద్దమవుతారు. ఇలాంటి ఉద్యోగాన్ని ఎవరు మాత్రం వదులుకుంటారు చెప్పండి. ఇంతకీ ఏంటా ఉద్యోగం అంటారా.. జస్ట్ సీసీటీవీ ఫుటేజ్ చూస్తూ కుర్చుంటే, నెలకు 30 వేల రూపాయల జీతం ఇచ్చేందుకు అమెరికాకు చెందిన కంపెనీలు రేడీ అయ్యాయి.
వర్చువల్ సూపర్ వైజర్‌గా పిలిచే ఈ ఉద్యోగంలో చేరే వారు చేయాల్సిందేంటంటే, షాపింగ్ మాల్స్, స్టోర్స్‌లో లైవ్ సీసీటీవీ ఫుటేజ్‌ను గమనిస్తూ అనుమానిత వ్యక్తుల గురించి క్యాషియర్‌కు చెప్పడమే. ఈ ఉద్యోగం చేయాలంటే అమెరికా వెళ్లాల్సిన అవసరం ఏ మాత్రం లేదు. భారత్ లో ఉండే ఈ ఉద్యోగం చేయవచ్చు. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఉద్యోగాలకు భారతీయులను ఎంపిక చేసేందుకే ఆమెరికా కంపెనీలు మొగ్గు చూపుతున్నాయి. డైరీ క్వీన్, హాలీడే ఇన్, హెల్, 7-ఎలెవన్ వంటి ప్రముఖ సంస్థలు తమ డిపార్ట్ మెంటల్ స్టోర్స్‌లో మోసాలను అరికట్టేందుకు ఈ పద్ధతిని ఎంపికచేసుకున్నాయి. ఈ ఉద్యోగానికి అపాయింట్ అయిన వ్యక్తి వర్చువల్ సూపర్ వైజర్‌గా వ్యవహరిస్తూ జాగ్రత్తగా లైవ్ సీసీటీవీ ఫుటేజ్ చూస్తూ ఉండాలి.
ఒకవేల ఎవరైనా వ్యక్తి స్టోర్‌లోని ఫ్రిజ్‌లో ఉన్న కూల్‌డ్రింక్ తాగేసి, క్యాషియర్ దగ్గరకు వచ్చాక తన కార్ట్‌లో ఉన్న వస్తువులకు మాత్రమే బిల్లు చెల్లించి, తాగిన కూల్ డ్రింక్ కు విషయం దాచిపెట్టాడనుకొండి.. అప్పుడు ఆ వ్యక్తి ఫ్రిజ్‌లో కూల్ డ్రింక్ తాగినట్టు మైక్ ద్వారా క్యాషియర్‌కు చెప్పి అలెర్ట్ చేయాలి. ఇలా ఎప్పుడూ సీసీటీవీ ఫుటెజ్ ను పరిశీలిస్తూ అలర్ట్ గా ఉండాలి, భలే ఉంది కదా ఈ ఉద్యోగం. ఈ ఉద్యోగానికి ఎంపికైన వ్యక్తికి నెలకు 399 డాలర్లు అంటే మన కరెన్సీలో 30 వేలు జీతం చెల్లిస్తారు. ఆసక్తి ఉన్నవారు https://www.myliveeye.com/careers.html# ద్వారా ఈ ఉద్యోగానికి అప్లై చేయవచ్చు.