ఇండియన్ టెలికం దిగ్గజం అనగానే రిలయన్స్ జియో గుర్తుకి వస్తుంది. మరి.. సెర్చ్ ఇంజిన్ దిగ్గజం అనగానే గూగుల్ పేరు వినిపిస్తుంది. ఈ రెండు ఓ ప్రోడక్ట్ కోసం చేతులు కలిపితే..? ఇప్పుడు అదే జరిగింది. ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ జియో నెక్ట్స్ కోసం ఈ రెండు సంస్థలు చేతులు కలిపాయి. అంతా అనుకున్నట్టుగానే అత్యంత చౌక ధరలో.. కేవలం రూ.4,000కే రిలయన్స్ జియో 4జీ నెక్స్ట్ ఫోన్ ప్రజల ముందుకి రాబోతుంది. వినాయక చవితి నుండి దీని అమ్మకాలు మొదలు కానున్నాయట. ఈ నేపథ్యంలో జియోఫోన్ నెక్ట్స్ ఫీచర్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
జియోఫోన్ నెక్ట్స్ ఫోన్ లో 720ఎక్స్1,440 పిక్సెల్స్ డిస్ ప్లే ఉంటుంది. ఇక క్వాల్కామ్ క్యూఎమ్ 215 ప్రాసెసర్ దీని సొంతం. క్వాల్కామ్ అడ్రెనో 308 జీపీయు అదనపు ఉపయోగకరం. బ్లూటూత్ వి4.2, 1080పీ వీడియో రికార్డింగ్, ఎల్ పిడీడీఆర్3 ర్యామ్, ఈఎమ్ఎమ్ సీ 4.5 స్టోరేజీ కెపాసిటీ జియోఫోన్ నెక్ట్స్ రేంజ్ అమాంతం పెంచేశాయి.
జియోఫోన్ నెక్ట్స్ కెమెరా ఫీచర్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. 13 మెగా పిక్సెల్ బ్యాక్ క్యామ్, 8 మెగా పిక్సెల్ ఫ్రెంట్ కెమెరా దీని సొంతం. ఇక 4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ ఉండనుంది. ఇన్ని అద్భుతమైన ఫీచర్స్ ఉన్న ఈ ఫోన్ ధర కేవలం రూ.4,000 కావడం ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తుంది. మరి.. జియోఫోన్ నెక్ట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.