అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ను అంతరిక్ష యాత్రకి తీసుకువెళ్ళే ‘న్యూషెపర్డ్’ వ్యోమనౌక అన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకుని బయలుదేరబోతుంది.ఈ నౌక పూర్తిగా అదే స్వయంగా వెళ్ళగలిగే సామర్ధ్యంతో రూపొందించారు.ఈ నౌకను మరోమారు రోదసి యాత్రకు వినియోగించుకోవచ్చు ..ఒకసారే కాదు ఎన్నిసార్లయినాఉపయోగించుకోవచ్చు.అంత పటిష్టమైన ఉత్తమ నాణ్యత కలిగిన వ్యవస్థతో దీన్నిరూపొందించారు. ఈ రోదసి యాత్ర అంతరిక్ష పర్యాటకానికి మరో మైలురాయి.‘వర్జిన్ గెలాక్టిక్’ అధినేత రిచర్డ్ బ్రాన్సన్ జూలై 12నచేపట్టిన అంతరిక్షయాత్ర తొలియాత్ర కాగా,అదేబాటలో ‘అమెజాన్’ అధినేత జెఫ్ బెజోస్ నడవనున్నారు.
సొంత సంస్థ ‘బ్లూ ఆరిజిన్’ అభివృద్ధి చేసిన తిరిగి వాడుకోగలిగే రాకెట్ ‘న్యూ షెపర్డ్’లో.. మరో ముగ్గురితోకలిసి ఆయన రోదసిలోకి వెళ్లనున్నారు. వారిలో ఒకరు బెజోస్ సోదరుడు మార్క్. మరొకరు 82 ఏళ్ల మాజీ మహిళా పైలట్ వాలీ ఫంక్.మూడో వ్యక్తి..అలివర్ డేమెన్ అనే18 ఏళ్ల విద్యార్థి.రోదసిలోకి వెళ్లనున్న అతి పిన్న,పెద్ద వయస్కులు వీరు. భారత కాలమానం ప్రకారం జూలై 20 సాయంత్రం ఆరున్నర గంటలకు ఈ యాత్ర మొదలుకానుంది. బ్రాన్సన్,శిరీష బండ్ల బృందం వెళ్లిన స్పేస్‌ఫ్లైట్‌ను నడపడానికి పైలట్లు కావాలి. కానీ, బెజోస్ యాత్ర పూర్తిగా ఆటోమేటిక్.
దీన్ని నడపడానికి పైలట్లు అవసరం లేదు. పైలట్లు లేకుండా పూర్తిగా సామాన్య పౌరులతో చేపట్టే తొలి రోదసియాత్రగా దీనిని పేర్కొనవచ్చు..పశ్చిమ టెక్సాస్ ఎడారిలోని ఒక సుదూర ప్రదేశం నుంచి ఈ రాకెట్ నింగిలోకి దూసుకుపోనుంది.బెజోస్ బృందం 100 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లి కర్మన్ రేఖ దాటి భూమి అందాలను వీక్షించి తిరిగి రానున్నారు.
రాకెట్ పయనం ఆరంభం అయిన వెంటనే అంతరిక్షం దిశగా దూసుకు వెళ్తుంది .గంటకు 3700 కిలోమీటర్ల వేగంతో పయనిస్తుంది. ప్రయాణం చేస్తున్న వ్యోమగాములు 3 రెట్లు ఎక్కువ గురుత్వాకర్షణ శక్తికి లోనవుతారు.తరువాత వ్యోమ నౌక నుంచి బూస్టర్ రాకెట్ విడిపోతుంది .వ్యోమగాములు సీటు బెల్టులను తొలగించి భార రహిత స్థితిని ఆస్వాదిస్తారు ..అంటే గాల్లో తెలినట్లుందే..అన్నట్లు ఉంటుందన్నమాట.అలా కార్ మాన్ రేఖ సరిహద్దుకి చేరతారు ..ఈ రేఖ సముద్ర మట్టానికి 100 కిలోమీటర్ల ఎగువున ఉంటుంది .ఆ తరువాత అపోజీ అనే ప్రదేశానికి చేరుకుంటుంది.ఇది యాత్రా మార్గంలో అత్యంత ఎత్తైన ప్రదేశం.
అపోజీలో కూడా భార రహిత శక్తి వ్యోమగాములలో కొనసాగుతూనే ఉంటుంది.తరువాత వ్యోమగాములు సీటు బెల్టులను పెట్టుకుంటారు.వ్యోమనౌక క్రిందకు దిగుతుంది.భూ వాతావరణంలోకి తిరిగి ప్రవేశిస్తుంది .వ్యోమగాములపై గురుత్వాకర్షణ ప్రభావం తిరిగి కనిపిస్తుంది.తరువాత పారాచూట్లు విచ్చుకుంటాయి.గంటకు16 కిలోమీటర్ల స్థాయికి వేగాన్నితగ్గించుకుంటూ కిందకు దిగుతుంది .
భూ వాతావరణం లోకి బూస్టర్ రాకెట్ పునః ప్రవేశించి ప్రయోగ వేదికకు 3.2 కిలోమీటర్ల దూరంలోని ల్యాండింగ్ పాడ్ దిశగా పయనిస్తుంది..వేగాన్నిగంటకి 1.6 కిలోమీటర్లకి తగ్గించుకుని వ్యోమనౌక సున్నితంగా నేలపై పశ్చిమ టెక్సాస్ లోని ఎడారి ప్రాంతం లో దిగుతుంది.ఈ విధంగా వీరి రోదసి యాత్ర పూర్తవుతుంది .