ఫిల్మ్ డెస్క్- ఆలితో సరదాగా.. ఈ బుల్లితెర షోకి మంచి క్రేజ్ ఉంది. సినీ ప్రముఖులను కామేడియన్ ఆలి ఇంటర్వూ చేయడం అందరిని ఆకట్టుకుంటోంది. ఆలితో సరదాగా షోలో పాల్గొన్న వారికి మళ్లీ మంచి సినిమా అవకాశాలు వస్తున్నాయని టాక్. ఆ సంగతి పక్కనపెడితే.. ఆలితో సరదాగా షోకు జీవిత, రాజశేఖర్ గెస్ట్ లుగా వచ్చారు.
ఆలి అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెబుతూ, కొన్ని సందర్బాల్లో ఎమోషనల్ అయ్యారు జీవిత, రాజశేఖర్. నిజానికి జీవిత, రాజశేఖర్ ల చుట్టూ ఎక్కువగా వివాదాలు చుట్టుముడుతుంటాయి. అందులోను రాజశేఖర్ అయితే మనసులో ఏముంటే అదే మాట్లాడతారు, తనకు అనిపించింది నిర్భయంగా చెబుతారు. దీంతో రాజశేఖర్ చాలా మందికి కొరకరాని కొయ్యగా మారితే, కొంత మందికి మాత్రం ఇష్టుడిగా మారారు.
కరోనా సెకండ్ వేవ్ లో రాజశేఖర్‌కు కరోనా సోకడంతో, నెల రోజుల పాటు ఆస్పత్రిలోనే ఉన్నారు. ఆలితో సరదాగా షోలో అప్పటి రోజులను రాజశేఖర్ గుర్తు చేసుకున్నారు. రాజశేఖర్ సినిమా షూటింగ్ మొదలుకాబోతోందనగా, వారం రోజుల ముందే ఆయనకు కరోనా సోకిందని జీవిత ఎమోషనల్ అయింది. సుమారు నెల రోజుల పాటు ఆయన ఐసీయూలోనే ఉన్నారని, అప్పుడు తమ పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలిసిందే.. అని జీవిత కన్నీటిపర్వంతమైంది.
సీరియస్ అయి మనం చచ్చిపోతాం, రేపు ఎళ్లుండి మనల్ని మంట పెట్టేస్తారు.. అని తన గురించి తాను చెప్పుకుంటూ రాజశేఖర్ సైతం ఎమోషనల్ అయ్యారు. సంక్రాంతి పండగ సందర్బంగా రాజశేఖర్, జీవిత ఇంటర్వూ షోను ప్రసారం చేయబోతోన్నారు. ఇందులో భాగంగా తాజాగా ఆలితో సరదాగా ప్రోమోను విడుదల చేశారు.