ఫిల్మ్ డెస్క్- జయప్రద.. ఒకప్పుడు టాప్ హిరోయిన్. తెలుగు నటి అయినప్పటికీ బాలీవుడ్ లో తన సత్తా చాటింది. శ్రీదేవితో సమానంగా బాలీవుడ్ లో సినిమాలు చేసింది జయప్రద. ఆ తరువాత రాజకీయాల్లో బిజీగా మారి సినిమాల్లో నటించడం తగ్గించింది. అడపా దడపా కొన్ని టీవీ షోలు చేసింది జయప్రద. ఇదిగో ఇన్నాళ్లకు మళ్లీ తెలుగు సినిమా చేయబోతోందట జయప్రద. అదికూడా అక్కినేని నాగార్జున సినిమాలో జయప్రద నచించనున్నారని తెలుస్తోంది. మన్మధుడు నాగార్జున కోసం జయప్రద రంగంలోకి దిగబోతుందనే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నాగార్జున ప్రెస్టీజియస్ మూవీ బంగార్రాజు సినిమాలో జయప్రద ఎంట్రీ ఉటుందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.
బంగార్రాజు సినిమాలో ప్రధానమైన రోల్ కోసం రీసెంట్‌గా ఈ చిత్ర దర్శకుడు జయప్రదను సంప్రదించడంతో ఆమె వెంటనే ఓకే చెప్పిందట. అక్కినేని నాగార్జున హీరోగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రూపొందబోతున్న బంగార్రాజు సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ఎప్పుడో సెట్స్ మీదకు రావాల్సి ఉండగా, కరోనా నేపధ్యంలో వాయిదా పడింది. గతంలో వచ్చిన సోగ్గాడే చిన్నినాయనా సినిమాలో బంగార్రాజు పాత్ర పోషించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న నాగార్జున, ఇప్పుడు అదే టైటిల్‌తో రాబోతుండటం అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది. త్వరలోనే ఈ సినిమాను సెట్స్ మీదకు వెళ్లనుందని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి.
బంగార్రాజు సినిమా కోసం ఇప్పటికే సీనియర్ నటి రమ్యకృష్ణను ఓకే చేశారు. మరో కీలకమైన పాత్ర కోసం జయప్రదను కూడా తీసుకోవాలని చిత్ర యూనిట్ నిర్ణయించిందట. నాగార్జున అత్త పాత్రలో జయప్రద నటించే అవకాశం ఉందని తెలుస్తోంది. బంగార్రాజు సినిమాలో నాగార్జున తనయుడు అక్కినేని నాగ చైతన్య సైతం ఓ కీలక పాత్రలో నచిస్తున్నారు. నాగార్జున రెండో కొడుకు అఖిల్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారని సమాచారం. మరి ఇంత మంది నటీనటులు నటిస్తున్న బంగార్రాజు సినిమా ఎలా ఉండబోతోందన్నదానిపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.