ఫిల్మ్ డెస్క్- ఓంకార్.. బుల్లితెర ప్రేక్షకులకు ఈ పేరు పెద్దగా పరిచయం చేయనక్కర్లేదు. తనదైన స్టైల్లో ఓంకారు కొత్త కొత్త కాన్సెప్టులతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. ఆట, మాయాద్వీపం, ఛాలెంజ్, డాన్స్ ప్లస్, ఇస్మార్ట్ జోడీ, కామెడీ స్టార్స్, సిక్స్త్ సెన్స్ వంటి వినూత్న కాన్సెప్ట్‌లతో ఓంకార్ దూసుకుపోతున్నాడు. ఓంకార్ హోస్ట్ చేస్తున్న సిక్స్త్ సెన్స్ సీజన్ 4 మంచి రేటింగ్‌తో ప్రేక్షకుల ఆధరణ పొందుతోంది.
శని, ఆదివారాల్లో సిక్త్స్ సెన్స్ ప్రసారం అవుతుండగా, గత వారం జబర్దస్త్ యాంకర్ రష్మి, మరో యాంకర్ వర్షిణిలు గెస్ట్‌లుగా వచ్చి హంగామా చేశారు. అంతకు ముందు ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ తన కూతురుతో కలిసి వచ్చి సిక్స్ సెన్స్ లో సందడి చేశారు. ఇక తాజాగా బుల్లితెర సీరియల్ జానకి కలగనలేదు ఫేమ్ అమర్ దీప్, ప్రియాంక జైన్.. మరో సీరియల్ దేవత ఫేమ్ అర్జున్, సుహాసినిలు సిక్త్స్ సెన్స్ షోకు గెస్ట్‌లుగా వచ్చేశారు. ఇంకముంది యాంకర్ ఓంకార్ ఈ రెండు సీరియల్ జంటలతో రచ్చ రచ్చ చేసేశాడు.
జానకి కలగనలేదు సీరియల్ ఇప్పటి వరకు 85 ఎపిసోడ్‌లు పూర్తి చేసుకుంది. ఈ సీరియల్ లో రామా, జానకిలకు పెళ్లైనప్పటికీ అనివార్య కారణాల వల్ల మొదటి రాత్రి జరగదు. ఎప్పటికప్పుడు ఫస్ట్ నైట్ వాయిదా పడినప్పటికీ.. ఇద్దరి మధ్య రొమాన్స్ మాత్రం నడుస్తుంటుంది. దీంతో వీళ్ల ఫస్ట్ నైట్ ఎప్పుడు జరుగుతుందబ్బా అని ప్రేక్షకులు సైతం ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.
సిక్స్త్ సెన్స్ షోలో జానకి కలగనలేదు టైటిల్ సాంగ్‌ను అద్భుతంగా ఆలపించిన ప్రియాంక జైన్.. ఆ తరువాత అమర్ దీప్ తో కలసి ఆ సాంగ్‌కి తగ్గట్టుగా పెర్ఫామెన్స్ ఇచ్చింది. వెంటనే ఓంకార్ డైరెక్ట్‌గా ఫస్ట్ నైట్ గురించి అమర్ దీప్, ప్రియాంక జైన్ లను అడిగేశాడు. ఇంతకీ మీకు ఫస్ట్ నైట్ అయ్యిందా లేదా అని సూటిగా ఓంకార్ అడగటంతో అమర్ దీప్, ప్రియాంక జైన్‌లు ఒకరి ముఖం ఒకరు చూసుకుని షాక్ అయ్యారు.
పెళ్లైతే అయ్యింది కానీ, శోభనం కాలేదని నాతో చెప్పాడని అమర్ దీప్ ను ప్రియాంక ముందు ఇరికించేశాడు ఓంకార్. ఇంతలో కాస్త తేరుకున్న అమర్ దీప్.. పెళ్లి 28 ఎపిసోడ్‌లోనే అయ్యింది, ఇప్పుడు 67 ఎపిసోడ్‌కి వచ్చేసింది.. కానీ ఫస్ట్ నైట్ మాత్రం కాలేదని ధీనంగా అన్నాడు. వెంటనే దేవత ఫేం అర్జున్ కల్పించుకుని 500 ఎపిసోడ్ వరకూ మంగళవారమే అని పంచ్ వేశాడు. దీంతో సిక్స్త్ సెన్స్ షో అంతా నవ్వుల మయం అయ్యింది. ఈ షోకు సంబందించిన ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.