స్పోర్ట్స్ డెస్క్- ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ అండర్సన్ క్రీడాభిమానులను మైమరపించాడు. ఆటలో తన పోరాట పటిమను చాటి అందరి అభిమానాన్ని చూరగొన్నాడు. కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా భారత్ తో జరుగుతున్న నాలుగో టెస్టులో ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ అండర్సన్ తన పట్టుదలతో అందర్ని ఆకట్టుకున్నాడు. గురువారం ప్రారంభమైన భారత్. ఇంగ్లండ్ టెస్టు మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ అండర్సన్ గాయపడ్డాడు.
మిడాఫ్‌లో బంతిని నిలువరించే క్రమంలో అతని మోకాలికి గాయమయ్యింద. మోకాలి గాయం నుంచి రక్తం కారుతున్నప్పటికీ బౌలింగ్ ను మాత్రం ఆపలేదు. రక్తం కారుతున్న మోకాలితో పలిగెత్తుతూనే బౌలింగ్ ను కొనసాగించిన జేమ్స్ అండర్సన్‌పై క్రీడాభిమానులు ప్రసంశలు కురిపిస్తున్నారు. అప్పటికి టీం ఇండియా తరపున రహానె, విరాట్ కోహ్లీ క్రీజులో ఉండటంతో, కోహ్లీ వికెట్ కోసమే అండర్సన్ మోాకాలికి గాయమైనా పట్టుదలతో బౌలింగ్ చేసినట్లు తెలుస్తోంది. కోహ్లీ, అండర్సన్ మధ్య 2014 నుంచి ఆధిపత్య పోరు నడుస్తోంది.
టెస్ట్ క్రికెట్ లోకి 2003లో ఎంట్రీ ఇచ్చిన జేమ్స్ అండర్సన్ ఇప్పటి వరకూ 166 టెస్టులు ఆడగా, ఏకంగా 631 వికెట్లు తీశాడు. ఇక మూడు సార్లు 10 వికెట్ల మార్క్‌ని అందుకున్న ఈ 39 ఏళ్ల పేసర్, 31 సార్లు 5 వికెట్ల మైలురాయిని అదిగమించాడు. ఇప్పటికే వన్డే, టీ20లకి దూరమైన జేమ్స్ అండర్సన్, టెస్టుల్లో మాత్రమే రెగ్యులర్‌గా ఆడుతున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న భారత్, ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్‌లోనూ విరాట్ కోహ్లీని రెండు సార్లు ఔట్ చేశాడు జేమ్స్ అండర్సన్.
భారత్ ఇంగ్లండ్ నాలుగో టెస్టులో పద్దతిగా బ్యాటింగ్ చేస్తున్న చతేశ్వర్ పుజారా ని తెలివిగా అండర్సన్ బోల్తా కొట్టించాడు. ఫోర్త్ స్టంప్ లైన్‌పై అండర్సన్ విసిరిన బంతిని ఆఖరి క్షణంలో బాదిన పుజారా, వికెట్ కీపర్ బెయిర్‌స్టోకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. భారత్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 191 పరుగులకి ఆల్ అవుట్ అవ్వగా, గురువారం ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 53/3తో నిలిచింది.
At 39 years, James Anderson is inspiring everyone with his dedication.#ENGvIND #JamesAnderson #TestCricket pic.twitter.com/4Y67lR0ANT
— Mohit Yadav(RCB Fan club) (@MohitYa33670908) September 2, 2021