ఫిల్మ్ డెస్క్- జబర్ధస్త్.. ఈ కామెడీ షోకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ప్రతి గరువారం జబర్దస్త్, శుక్రవారం ఎక్స్ ట్రా జబర్దస్త్ పేరుతో ప్రసారం అవుతున్న ఈ కార్యక్రమం బాగా పాపులర్. ఈ షోలో వచ్చే కామోడీ స్కిట్లకి పడి పడి నవ్వాల్సిందే. ఐతే ఈ మద్య కాలంలో జబర్దస్త్ లో కాస్త డబల్ మీనింగ్ స్కిట్స్ ఎక్కువవ్వడంతో మెల్ల మెల్లగా క్రేజ్ తగ్గిపోతుందన్న టాక్ వినిపిస్తోంది. ఇక జబర్దస్త్ షో లో స్కిట్స్ చేసే కంటెస్టెంట్స్ ఎంత ఫేమస్సో, అంతకంటే యాంకర్లు, జడ్జీలు ఇంకా ఫేమస్ అని చెప్పవచ్చు. బజర్దస్త్ కు అనసూయ, ఎక్స్ ట్రా జబర్దస్త్ కు రష్మీ యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ రెండు కామెడీ షోలకు రోజా, గాయకుడు మనో జడ్జీలుగా ఉంటున్నారు. ఐతే రోజా అనారోగ్య కారణాలతో కొన్నాళ్ల పాటు జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్‌కి దూరం అయ్యారు. ఆమె స్థానంలో సీనియర్ హీరోయిన్, గ్లామర్ క్వీన్ ఇంద్రజ ఎంట్రీ ఇచ్చారు.
రోజా స్థానంలో వచ్చిన ఇంద్రజ, ఆమెలాగా ఏంచేస్తుందిలే అని అంతా అనుకున్నారు. కానీ జబర్దస్త్ జడ్జీగా ఇంద్రజ తన మార్క్ చూపించారు. వన్నెతరగని అందం, చక్కని చిరునవ్వుతో పాటు, స్కిట్స్‌లలో ఇన్వాల్వ్ అవుతూ పంచ్‌లు వేసి అతి తక్కువ సమయంలోనే జబర్దస్త్ ద్వారా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించింది ఇంద్రజ. ఇన్నాళ్లు సినిమాలతో రాని క్రేజ్, జబర్ధస్త్ కామెడీతో సంపాదించానని స్వయంగా ఇంద్రజనే చెప్పారు. ఇలా జబర్దస్త్ గా సాగిపోతున్న కార్యక్రమంలో ఇంద్రజ స్థానంలో మళ్లీ రోజా కనిపించే సరికి అంతా షాక్ అయ్యారు. జడ్జ్ గా ఇంద్రజ బాగానే చేస్తున్నారు కదా, మళ్లీ రోజా ఎందుకు వచ్చారని అంతా అయోమయంలో పడ్డారు. ఐతే తన ఆరోగ్యం కుదుటపడటంతో రోజా మళ్లీ జడ్జ్ గా వచ్చేశారని, తాత్కాలికంగా వచ్చిన ఇంద్రజ వెళ్లిపోయారని తెలుస్తోంది. దీంతో ఇంద్రజ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రోజా వద్దు, ఇంద్రజ ముద్దు అంటూ ఆమె ఫ్యాన్స్ కామెంట్లు పెడుతూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. వచ్చేవారానికి సంబంధించిన ప్రోమో విడుదలవ్వగా, అందులో ఇంద్రజ స్థానంలో రోజా కనిపించడంతో ఆమె అభిమానులు మండిపడుతున్నారు. ఇంద్ర ధనుస్సు కనిపించడం లేదు.. ఇంద్రజ నవ్వు మిస్ అయ్యింది.. ఆమెనే జడ్జీగా కొనసాగించాలి.. ఎవర్నైతే జనం బాగా ఇష్టపడుతుంటారో వాళ్లని ఉంచరా.. ఇంద్రజ గారిని దయచేసి కొనసాగించండి.. అంటూ జబర్దస్త్ షో నిర్వాహకులైన మల్లెమాల యూనిట్ కు విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఏంచేయాలో తెలియని అయోమయంలో పడ్డారట మల్లేమాల. ఎలాగూ రెండు షో లకు అనసూయ, రష్మి ఇద్దరు యాంకర్స్ ఉన్నారు కాబట్టి, జబర్దస్త్ కు రోజా, ఎక్స్ ట్రా జబర్దస్త్ కు ఇంద్రజను జడ్జ్ గా పెడితే ఎలా ఉంటుందన్నదానిపై మల్లెమాల యూనిట్ ఆలోచిస్తోందట.