వెండితెర హంగామా ఎంత ఉందో బుల్లితెర హవా కూడా అదే రేంజ్‌లో కనిపిస్తోంది. పైగా కరోనా కారణంగా సిల్వర్ స్క్రీన్స్ బోసిపోవడంతో ప్రతి ఇంట ఉన్న బుల్లితెరలకు డిమాండ్ పెరిగింది. దీంతో పలు ప్రోగ్రామ్స్ ద్వారా వినోదం పంచుతూ ఎంటర్‌టైన్ చేస్తున్నాయి టీవీ ఛానెల్స్. హైపర్ ఆది బాగా మాట్లాడగలడు, బాగా పంచ్ లు వేయగలడు, మంచి మంచి స్క్రిప్ట్స్ రాసుకొని తన షో తానే చేసుకోగలదు. జబర్దస్త్ కమేడియన్ హైపర్ ఆదికి దిమ్మతిరిగే షాక్ తగిలింది. హైపర్ ఆదిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ సభ్యులు. హైపర్ ఆదిపై ఎల్బి నగర్ ఏసీపీ శ్రీధర్ రెడ్డికి తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ సభ్యులు ఫిర్యాదు చేశారు.
ఓ టీవీ చానెల్ ప్రోగ్రాంలో తెలంగాణ బతుకమ్మను, గౌరమ్మను, తెలంగాణ భాష మరియు యాసని కించపరిచే విధంగా ఆది స్క్రిప్ట్ చేశాడని ఫిర్యాదు చేశారు. జబర్దస్త్ హైపర్ అది, స్క్రిప్ట్ రైటర్ , మల్లెమాల ప్రొడక్షన్ పై చర్యలు తీసుకోవాలని పిర్యాదులో పేర్కొన్నారు తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ సభ్యులు. గతంలో ఎమ్మెస్ నారాయణ జయంతి రోజున కూడా ఆదికి షాక్ తగిలిన సంగతీ పాఠకులకి విదితమే హైపర్ ఆదిపై కామెడీ చేస్తూ వర్ధంతికి, జయంతికి తేడా తెలియదా అని ఒక ఆట ఆదుకున్నారు. కానీ అతడు ఆ కామెంట్స్ ను దాదాపుగా రెండు గంటల పాటు చూసుకోలేదు. ఆ తరువాత అతడు చూసుకొని నాలుక కార్చుకొని ఆ పోస్ట్ వెంటనే డిలీట్ చేసి మరొక పోస్ట్ పెట్టడం జరిగింది.
అలాగే ఇదివరకూ ఆదిపై మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు అందింది. తమ మనోభావాలను దెబ్బతీసేలా ఆది ఓ స్కిట్ చేశారని ఆరోపిస్తూ పలువురు అనాథ పిల్లలు, సినీ విమర్శకుడు కత్తి మహేష్ లు హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు. అయితే ఇప్పుడు ఎల్బీ నగర్ లో ఆదిపై ఫిర్యాదుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.