Kevin O’Brien: ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ప్రజలు వీక్షించే.. క్రికెట్ ప్రపంచంలోకి ఎంతో మంది వస్తుంటారు.. పోతుంటారు. అందులో నామమాత్రపు ఆటగాళ్లు ఉంటారు. దిగ్గజ క్రికెటర్లు ఉంటారు. తమకంటూ ఏదైనా ప్రత్యేక గుర్తింపు ఉంటే తప్ప.. ఆటగాళ్లను గుర్తుంచుకోవడం చాలా అరుదు. అలా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని.. ఇంగ్లాండ్ ఆటగాళ్లకు నిద్రలేని రాత్రులు మిగిల్చిన క్రికెటర్.. కెవిన్ ఒబ్రెయిన్(ఐర్లాండ్). 2011 వన్డే వరల్డ్‌కప్‌లో బెంగళూరు వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కెవిన్.. పెను విధ్వంసం సృష్టించాడు. ఆ మ్యాచ్‌లో అతను కేవలం 50 బంతుల్లోనే 100 పరుగుల మార్క్ చేరుకుని, రికార్డు శతకాన్ని నమోదు చేసి తన జట్టుకు చారిత్రక విజయాన్ని అందించాడు.
అలాంటి గొప్ప ఆటగాడు సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. పదహారేళ్ల తన సుదీర్ఘ కెరీర్‌కు గుడ్‌బై చెప్పాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరుగనున్న టీ20 ప్రపంచకప్ టోర్నీ తర్వాత ఆట నుంచి వైదొలుగుదామని భావించినప్పటికీ.. గత కొన్ని రోజులుగా తనను సెలక్టర్లు పక్కనపెట్టారన్న కెవిన్.. అందుకే తాను రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు వెల్లడించాడు. ఈ మేరకు ట్విటర్ వేదికగా సుదీర్ఘ నోట్ షేర్ చేశాడు.
Thanks ☘️ pic.twitter.com/E4335nE8ls
— Kevin O’Brien (@KevinOBrien113) August 16, 2022
2006లో అరంగేట్రం చేసిన కెవిన్ 153 వన్డేల్లో 3,618 పరుగులతో పాటు 114 వికెట్లను పడగొట్టాడు. ఐర్లాండ్ తరఫున వన్డేల్లో అత్యధిక వికెట్ల రికార్డు అతని పేరిటే ఉంది. భారత్ ఆతిథ్యమిచ్చిన 2011 వన్డే ప్రపంచకప్ ద్వారా వెలుగులోకి వచ్చిన కెవిన్.. అనంతరం స్టార్ బ్యాట్స్‌మన్‌గా ఎదిగాడు. నాటికి వన్డే ప్రపంచకప్‌లో కెవిన్‌దే అత్యంత వేగవంతమైన శతకంగా నిలిచింది. సెలెక్టర్లపై కోపంతో.. ఇలా రిటైర్మెంట్ ప్రకటించడం కరెక్టేనా? ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Ireland’s Kevin O’Brien has announced his retirement from international cricket.
What a player! Truly the end of an era in Irish cricket! Going to remember his 2011 World Cup knock vs England forever!#ThankYouKevinpic.twitter.com/X4mqOHYInA
— Prasenjit Dey (@CricPrasen) August 16, 2022
ఇదీ చదవండి: క్షణాల్లో అమ్ముడైన భారత్-పాక్ మ్యాచ్ టికెట్లు! ఒకే సారి 7.5 లక్షల మంది..
ఇదీ చదవండి: వీడియో: త్రో బౌలింగ్ వేశాడు! పాక్ బౌలర్ యాక్షన్‌పై స్టోయినీస్..