సంజూ శాంసన్.. ఏడాదికాలంగా ఈ పేరు భారత్ లో బాగా వినిపిస్తోంది. చాలా మంది క్రికెటర్లు రికార్డులు క్రియేట్ చేస్తూ పాపులర్ అవుతుంటే.. సంజూ మాత్రం అవకాశం కోసం పోరాడుతూనే ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. 2015లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన సంజూ ఇప్పటివరకు కేవలం 27 మ్యాచ్ లు మాత్రమే ఆడటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వాటిలో కూడా 2022లోనే ఎక్కువ మ్యాచ్ లు ఆడటం గమనార్హం. వరల్డ్ కప్ సంగతి పక్కన పెడితే కనీసం బంగ్లాదేశ్ పై కూడా సంజూని ఎంపిక చేయకపోవడం అందరినీ ఆగ్రహానికి గురి చేసింది. ఈ విషయంలో ఎప్పుడూ నోరు మెదపని సంజూ శాంసన్ ఇప్పటికీ తనకు అవకాశం రాకపోతుందా అంటూ ఎదురుచూస్తూనే ఉన్నాడు. ఇలాంటి తరుణంలోనే ఓ వార్త నెట్టింట వైరల్ అయ్యింది. అదేంటంటే పరాయి దేశం సంజూకి సూపర్ ఆఫర్ ప్రకటించిందని చెబుతున్నారు.
తమ దేశం తరఫున ఆడేందుకు అంగీకరిస్తే అన్ని ఫార్మట్లలో ఆడేందుకు అవకాశం కల్పిస్తామంటూ తెలిపారంట. అయితే ఈ ఆఫర్ ను సంజూ శాంసన్ సున్నితంగా తిరస్కరించినట్లు చెబుతున్నారు. అతను క్రికెట్ ఆడితే అది కేవలం భారత్ తరఫునే అంటూ తెలిపినట్లు సమాచారం. తనకు అవకాశం వచ్చే వరకు వేచిచూస్తానంటూ సమాధానం చెప్పాడని కూడా వార్తలు వచ్చాయి. అయితే.. తాజాగా ఈ వార్తలో ఎలాంటి నిజం లేదని తేలింది.
Sanju Samson has not been getting enough chances in Team India 🤯#CricketTwitter #teamindia pic.twitter.com/VAAQzoSif2
— Sportskeeda (@Sportskeeda) December 11, 2022
ఇదిలా ఉండగా.. కేవలం కేఎల్ రాహుల్ కి అవకాశం కల్పించడం కోసమే సంజూ శాంసన్ కెరీర్ ని నాశనం చేస్తున్నారంటూ విమర్శలు ఉండనే ఉన్నాయి. వాటికి బలాన్ని చేకూర్చేలా.. బంగ్లాదేశ్ పై రాహుల్ కీపింగ్ చేయడాన్ని ఎత్తి చూపుతున్నారు. ఏది ఏమైనా సంజూ శాంసన్ మాత్రం పరాయి దేశానికి వెళ్తే నిజంగానే టీమిండియాకి పెద్ద నష్టమే జరుగుతుంది.
Sanju Samson’s international matches each year
1 – 2015
0 – 2016
0 – 2017
0 – 2018
0 – 2019
6 – 2020
4 – 2021
16 – 2022 #SanjuSamson The Untold Story 😊 pic.twitter.com/geXbv0rxyC— Shubhankar Mishra (@shubhankrmishra) November 30, 2022