మరికొన్ని గంటల్లో ధనాధన్ లీగ్ ఐపీఎల్ 2023 సీజన్ ప్రారంభం కానుంది. చెన్నై సూపర్ కింగ్స్- గుజరాత్ టైటాన్స్ మధ్య అహ్మదాబాద్ వేదికగా తొలి మ్యాచ్ మార్చి 31న జరగనుంది. అయితే ఎప్పుడూ లేని విధంగా ఈసారి సీజన్ పై ఎక్కడా బజ్ కనిపించడం లేదు.
IPL.. ఈ పేరు వినగానే క్రికెట్ అభిమానుల్లో ఉత్సాహం ఉరకలేసేది. సీజన్ మొత్తం ఎన్ని పనులు ఉన్నా సాయంత్రం కాగానే ఇంటిల్లిపాది టీవీలకు అతుక్కునే వాళ్లు. వయసుతో సంబంధం లేకుండా తమ జట్టు గెలవాలంటూ నినాదాలు చేసేవాళ్లు. ఇంట్లో ఉన్నా, ఆఫీసుల్లో ఉన్నా, ప్రయాణాల్లో ఉన్నా తమ ఫేవరెట్ క్రికెటర్ ఆట చూసేందుకు ఆరాటపడేవాళ్లు. ఐపీఎల్ వస్తోందంటే.. ఆ రెండు నెలలు ఇంట్లో ఆడవాళ్లకు సాయంత్రం సీరియల్స్ కట్ అయినట్లే. అయితే ఇప్పడు మాత్రం సీన్ రివర్స్ అయ్యిందనే చెప్పాలి. ముఖ్యంగా ఈ సీజన్లో ప్రేక్షకుల నుంచి ఐపీఎల్ మీద అంత ఆసక్తి ఉన్నట్లు కనిపించడం లేదు. అందుకు తగిన కారణాలు కూడా లేకపోలేదు.
ఐపీఎల్ అనగానే ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ఫ్యాన్స్ లో విపరీతమైన క్రేజ్ ఉండేది. సీజన్ మొదలైనప్పటి నుంచి ఫైనల్ గెలిచే వరకు ఒక ఉద్విగ్న వాతావరణం నెలకొని ఉండేది. కానీ, ఈ సీజన్ లో అలాంటి పరిస్థితులు కనిపించడం లేదు. మరికొన్ని గంటల్లో సీజన్ ప్రారంభం కానున్నా కూడా.. ఎక్కడా హడావుడి లేదు. ముఖ్యంగా ఐపీఎల్ మీద ఎలాంటి బజ్ లేకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అంతేకాకుండా ఈ సీజన్ పై ప్రేక్షకులకు ఆసక్తి లేదనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. అసలు ఎవరూ ఐపీఎల్ గురించి పట్టించుకునే పరిస్థితి లేదనిపిస్తోంది.
𝗖𝗔𝗡. 𝗡𝗢𝗧. 𝗪𝗔𝗜𝗧! ⏳
Just one sleep away from #TATAIPL 2023! 🥳 pic.twitter.com/H0h91A5sdy
— IndianPremierLeague (@IPL) March 30, 2023
ఎందుకంటే గతంలో అయితే సచిన్, గంగూలీ, ద్రవిడ్, సెహ్వాగ్, యువరాజ్ వంటి స్టార్లు అటు నేషనల్ టీమ్ లో ఆడుతూనే.. ఇటు ఐపీఎల్ లో అలరించేవాళ్లు. తమ అభిమాన క్రికెటర్ ఎప్పుడొస్తాడా అంటూ ఫ్యాన్స్ అంతా కళ్లు కాయలు కాచేలా ఎదురు చూసేవాళ్లు. ఆ తర్వాత ఆ క్రేజ్ ని ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కొనసాగించారు. ఇప్పుడు యంగ్ ప్లేయర్లు రావడం, వారు ఐపీఎల్- టీమిండియా ఇలా దేనిలోనైనా అంత ఆసక్తిగా కనిపించకపోవడమే.. ముఖ్యంగా ఐపీఎల్ క్రేజ్ ని తగ్గేలా చేసిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియా ఇంతగా అందుబాటులో ఉన్నా ఈ సీజన్ బజ్ లేకపోవడమే ఇలాంటి ప్రశ్నలు, సమాధానాలకు తావిస్తోంది. ఈ ఐపీఎల్ సీజన్ రసవత్తరంగా ఉండబోతోందా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Game Face 🔛
ARE. YOU. READY for #TATAIPL 2023❓ pic.twitter.com/eS5rXAavTK
— IndianPremierLeague (@IPL) March 30, 2023