మనం కుటుంబ సభ్యులతో లేదా స్నేహితులతో కలిసి హోటళ్లకు వెళ్తుంటాము. అక్కడ హోటళ్ల సిబ్బంది.. మనం ఇచ్చిన ఆర్డర్లను సప్లయ్ చేస్తూ.. మనకు సర్వ్ చేస్తుంటారు. చివర్లో హోటళ్ల నుంచి బయటకి వచ్చే సమయంలో ఆ హోటళ్ల సిబ్బందికి మనకు తొచినంత టిప్ గా ఇస్తుంటాము. అయితే కొందరు మాత్రం హోటళ్ల సిబ్బందే ఆశ్చర్యపడేలా టిప్స్ ఇస్తుంటారు
మనం కుటుంబ సభ్యులతో లేదా స్నేహితులతో కలిసి హోటళ్లకు వెళ్తుంటాము. అక్కడ హోటళ్ల సిబ్బంది.. మనం ఇచ్చిన ఆర్డర్లను సప్లయ్ చేస్తూ.. మనకు సర్వ్ చేస్తుంటారు. చివర్లో హోటళ్ల నుంచి బయటకి వచ్చే సమయంలో ఆ హోటళ్ల సిబ్బందికి మనకు తొచినంత టిప్ గా ఇస్తుంటాము. ధనవంతులు అయితే ఇంకాస్తా టిప్ ఎక్కువగా ఇస్తుంటారు. అయితే కొందరు మాత్రం హోటళ్ల సిబ్బందే ఆశ్చర్యపడేలా టిప్స్ ఇస్తుంటారు. నోట్ల కట్టలు, గోల్డ్ కాయిన్ వంటివి టిప్ గా ఇస్తుంటారు. తాజాగా ఓ యూట్యూబర్ రెస్టారెంట్ వెయిట్రెస్ కు ఏకంగా బ్రాండ్ న్యూ కారును బహుమతిగా ఇచ్చారు. ఆయన ఇచ్చిన సడెన్ సర్ ఫ్రైజ్ కు ఆ యువతి ఆశ్చర్యానికి లోనైంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..
అమెరికాకు చెందిన ప్రముఖ యూట్యూబర్ జిమ్మీ డొనాల్డ్ సన్ ఓ రెస్టారెండ్ లో పని చేస్తున్న మహిళ సిబ్బందిని ఆశ్చర్యానికి గురి చేశాడు. జిమ్మీ డోనాల్డ్ సన్ కు మిస్టర్ బీస్ట్ గా ప్రత్యేకగా పిలుస్తారు. ఆయన ఓ రెస్టారెంట్ వెయిట్రెస్‌కు ఏకంగా బ్రాండ్ న్యూ కార్‌ను బహుమతిగా ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఈవీడియోలో హోటళ్ల లో పనిచేస్తున్న ఓ యువతికి జిమ్మీ డోనాల్డ్ సన్ తన బిజినెస్ వెంచర్ ను ప్రచారం చేసే లోగోతో కూడిన బ్రాండ్ కారును బహుమతిగా ఇచ్చారు. ఆ కారు ఇచ్చే ముందు ఆ యువతిని కొన్ని ప్రశ్నలు వేశారు. ఇప్పటి వరకు నీవు అందుకున్న అత్యధిక టిప్ ఎంత అని బీస్ట ఆ యువతిని ప్రశ్నిస్తాడు. 50 డాలర్ల వరకూ ఉంటుందని ఆ యువతి బదులిస్తుంది.
ఇప్పటి వరకూ ఎవరైనా టిప్‌గా కారు ఇచ్చారా? అని అడుగుతాడు. లేదు అని ఆమె సమాధానం చెప్పగానే కారు తాళాలను తీసి వెయిట్రెస్‌కు అప్పగించగా ఆమె ఆశ్చర్యానికి లోనవుతుంది. ఆ తరువాత ఇద్దరు కలిసి కారు ఉన్న ప్రదేశం వద్దకు వెళ్తారు. బ్లాక్ టయోటా కారును ఆ యువతికి బీస్ట్ టిప్ గా అందించాడు. కారుపై తన చాక్లెట్ కంపెనీ ఫీస్టబుల్ లోగో కనిపిస్తుంది. ఊహించని ఖరీదైన టిప్ అందుకోవడంతో ఆ యువతి ఉద్వేగానికి లోనవుతుంది. డొనాల్డ్‌సన్ ఔదార్యం నెటిజన్ల మనసులను గెలిచింది. అంతేకాక ఆయనకు నెటిజన్ల నుంచి ప్రశంసల వర్షం కురుస్తుంది. మరి.. కారును టిప్ గా ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.