యూట్యూబ్ తమ వినియోగదారులకు గుడ్ న్యూస్ తెలిపింది. యూట్యూబ్ సుమారు 100 డాలర్ల నుంచి 10,000 డాలర్ల వరకు యూజర్లకు రివార్డ్ ఇవ్వనుంది. కాగా ఈ రివార్డులను సొంతం చేసుకోవాలంటే ఒక చిన్న మెలిక పెట్టింది. షార్ట్ వీడియోలకు వచ్చే వ్యూస్‌ను ఆధారం చేసుకొని రివార్డులను అందించనుంది. షార్ట్ వీడియో క్రియేటర్లు బోనస్ చెల్లింపుల కోసం క్లెయిమ్ చేసుకోవాలని యూట్యూబ్ సపరేటుగా అడుగుతోంది. ప్రతి నెల షార్ట్ వీడియోలకు వచ్చిన వ్యూస్‌ను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. యూట్యూబ్ ప్రకారం ఆయా కంటెంట్ క్రియేటర్లు చేసిన షార్ట్ వీడియోలు వ్యూస్ విషయంలో కచ్చితంగా క్వాలిఫై అవాల్సి ఉంటుంది.
యూట్యూబ్ షార్ట్స్ ఫండ్‌ను భారత్‌తోపాటుగా యుఎస్, యుకె, బ్రెజిల్, ఇండోనేషియా, జపాన్, మెక్సికో, నైజీరియా, రష్యా , దక్షిణాఫ్రికా దేశాల్లోని కంటెంట్ క్రియేటర్లు ఈ ఫండ్ ద్వారా డబ్బు సంపాదించడానికి అర్హులు. యూజర్లు తమ యూట్యూబ్ ఛానెల్ నుంచి అర్హత సాధించిన షార్ట్ వీడియోను గత 180 రోజుల్లో అప్లోడ్ చేసి ఉండాలి. షార్ట్స్ వీడియో కచ్చితంగా ఒరిజినల్ కంటెంటై ఉండాలి. ఇతర వాటర్‌మార్క్‌లు లేదా లోగోలతో వీడియోలను అప్లోడ్ చేసేవారు అర్హులు కాదు. ఇతర యూట్యూబ్ ఛానళ్ల వీడియోలను అప్లోడ్ చేయకూడదు. ఈ వీడియోలు యూట్యూబ్ షార్ట్స్ ఫండ్‌కు అర్హత సాధించవు.
యూజర్లు 18 సంవత్సరాలు పైబడి ఉన్నవారై ఉండాలి.త్వరలో ఈ పోటీని మరిన్ని దేశాలకు విస్తరించాలని యూట్యూబ్ యోచిస్తోంది. 2021 నుంచి 2022 మధ్య వైరలైన షార్ట్ వీడియోల కోసం యూజర్లకు రివార్డ్ అందించడంలో ఈ ఫండ్ ఉపయోగపడనుంది. దీనికోసం ముందుగా షార్ట్ వీడియోలు అప్ లోడ్ చేసే క్రియేటర్లు బోనస్ చెల్లింపుల కోసం క్లెయిమ్ చేసుకోవాలని కోరింది. యూట్యూబ్ సుమారు 100 డాలర్ల నుంచి 10,000 డాలర్ల వరకు యూజర్లకు రివార్డ్ ఇవ్వనుంది. కాగా ఈ రివార్డులను సొంతం చేసుకోవాలంటే ఒక చిన్న మెలిక పెట్టింది. షార్ట్ వీడియోలకు వచ్చే వ్యూస్‌ను ఆధారం చేసుకొని రివార్డులను అందించనుంది.
యూట్యూబ్ ప్రకారం ఆయా కంటెంట్ క్రియేటర్లు చేసిన షార్ట్ వీడియోలు వ్యూస్ విషయంలో కచ్చితంగా క్వాలిఫై అవాల్సి ఉంటుంది. యూట్యూబ్ షార్ట్స్ ఫండ్‌ను భారత్‌తోపాటుగా యుఎస్, యుకె, బ్రెజిల్, ఇండోనేషియా, జపాన్, మెక్సికో, నైజీరియా, రష్యా , దక్షిణాఫ్రికా దేశాల్లోని కంటెంట్ క్రియేటర్లు ఈ ఫండ్ ద్వారా డబ్బు సంపాదించడానికి అర్హులు.
త్వరలో ఈ పోటీని మరిన్ని దేశాలకు విస్తరించాలని యూట్యూబ్ యోచిస్తోంది. యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్లను ఆకర్షించేలా మరో కొత్త ఫీచర్‌ను కూడా తీసుకొచ్చింది.‘సూపర్ థ్యాంక్స్’ అనే ఈ ఫీచర్‌ను పరిచయం చేసింది. దీంతో యూట్యూబర్లు మరింత డబ్బు సంపాదించే అవకాశాన్ని కల్పించింది.