ప్రాంకు.. చేసిందందా చేసి.. ఏం లేదు తూచ్ అని అనటమే.. ఈ ప్రాంకుల మొదటి లక్షణం. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ప్రాంకులు చాలా ఎక్కువయిపోయాయి.
ఈ మధ్య కాలంలో ప్రాంక్‌లు చాలా ఎక్కువయిపోయాయి. కొంతమంది సోషల్ మీడియా వ్యక్తులు తాము ఫేమస్ అవ్వటానికి పిచ్చి పిచ్చి ప్రాంకులు చేస్తున్నారు. కొందరు ఓ అడుగు ముందుకు వేసి ఇతరుల మనసుతో చెలగాటం ఆడుతున్నారు. ఇంకా కొంతమంది ప్రాంకులు చేసి.. ప్రాణాల మీదకే తెచ్చుకుంటున్నారు. తాజాగా, ఓ వ్యక్తి ప్రాంకు చేసి ప్రాణాల మీదుకు తెచ్చుకున్నాడు. కొంచెం ఉంటే తుపాకి గుండుకు అతడి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. తుపాకి చేతిలో ఉన్నది ఓ ముసలాయన కాబట్టి.. బతికి పోయాడు.
ఈ సంఘటన అమెరికాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని ఓ ప్రాంతానికి చెందిన ఓ యువకుడికి యూట్యూబ్‌లో ఓ ఛానల్ ఉంది. అందులో ప్రాంక్ వీడియోలు చేస్తూ ఉంటాడు. ఓ రోజు ఫేక్ పెట్రోల్ పట్టుకుని వాహనాలు నిలిపి ఉంచే పార్కింగ్ యార్డ్‌లోకి వచ్చాడు. ఒక్కో కారుపై పెట్రోల్ పోస్తూ ఉన్నాడు. ఆ కారు వాళ్లు భయపడిపోతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఓ ముసలాయన కారు దగ్గరకు వచ్చాడు. కారుపై ఫేక్ పెట్రోల్ పోసి ఆయన్ని భయపెట్టాలని చూశాడు.
అయితే, ఆ ముసలాయనకు కోపం వచ్చింది. వెంటనే తన కారులోంచి తుపాకి బయటకు తీశాడు. దానితో ప్రాంక్ చేసే యువకుడ్ని కాల్చబోయాడు. ముసలాయన చేతిలో తుపాకి చూసిన యువకుడు అక్కడినుంచి పరుగులు తీశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు..‘‘ ప్రాంకులు చేసే వారిని అరెస్ట్ చేయాలి’’.. ‘‘ ప్రాంకులతో ప్రాణాలు మీద తెచ్చుకుంటున్నారు.. జాగ్రత్త!’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి, ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Live-streamer is filmed pouring fake gasoline on cars as a prank before someone pulls a real gun on him.
— Ian Miles Cheong (@stillgray) May 18, 2023