శృంగారం అన్నది ప్రతీ మనిషి జీవితంలో ముఖ్యమైన భాగం. వైవాహిక జీవితం సాఫీగా సాగటానికి శృంగారం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. శృంగారంలో భావప్రాప్తికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది...
ఈ సమాజం శృంగారాన్ని బూతుగా భావిస్తుంటుంది. దాని గురించి పబ్లిక్‌గా మాట్లాడటానికి.. చర్చించటానికి జనం సిగ్గుతో కూడిన భయాన్ని చూపిస్తుంటారు. అయితే, శృంగారం అన్నది వైవాహిక జీవితంలో ఎంతో ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. ఏ జంట అయితే శృంగారపరంగా మంచి అనుభవాన్ని పొందుతుందో.. ఆ జంట సంతోషకరమైన జీవితాన్ని అనుభవిస్తుంది. కానీ, కొంతమంది పడక గదిలో ఎదురయ్యే సమస్యలను బయటకు చెప్పటానికి ఇబ్బంది పడుతుంటారు. భార్యాభర్తలు కూడా వీటి గురించి చర్చించటానికి ముహమాటపడుతూ ఉంటారు. దీంతో జీవితం ఇబ్బందుల పాలవుతుంది. శృంగారం అంటే కేవలం ఇంటర్ కోర్స్ మాత్రమే కాదు. ఆడ,మగ ఇద్దరూ భావప్రాప్తి పొందినపుడే అది అసలైన శృంగారం.
భావప్రాప్తి అంటే శృంగారంలోని ఫైనల్ దశ. భావప్రాప్తి స్వర్గ అనుభూతిని ఇస్తుంది. ఈ భావప్రాప్తి పురుషులకు ఒక విధంగా స్త్రీలకు మరో విధంగా ఉంటుంది. వీర్యం అంగం ద్వారా బయటకు వెళ్లినపుడు పురుషుడు భావప్రాప్తి పొందుతాడు. కానీ, స్త్రీలకు అలాకాదు. వారిని సుఖపెట్టడానికి కొన్ని విధానాలను పాటించాలి. వారికి ఇష్టం అయినట్టుగా మనం నడుచుకోవాలి. అయినా కొన్ని సార్లు స్త్రీలు సంతృప్తి పొందటం జరగదు. ఇంటర్ కోర్స్ ద్వారా స్త్రీలు భావప్రాప్తి పొందటానికి దాదాపు 20 నిమిషాలు పడుతుందుని అంచానా. శృంగారం ద్వారా కేవలం 20 శాతం మంది స్త్రీలు మాత్రమే భావప్రాప్తి పొందుతున్నారని ఓ సర్వేలో తేలింది. శృంగారానికి సంబంధించి స్త్రీలకు ఎంతో ముఖ్యమైన భావప్రాప్తిని ఓ మహిళ చాలా తేలిగ్గా పొందుతోంది.
అది కూడా తన మెదడును కంట్రోల్ చేసుకోవటం ద్వారా. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఈలా వోంక్ అనే ఇన్‌స్టాగ్రామ్ సెలెబ్రిటీ పురాతన కామసూత్ర పుస్తకాన్ని చదవిందట. తర్వాత యోగా, మెడిటేషన్‌ను ప్రాక్టీస్ చేసిందట. దీంతో ఎలాంటి ఇంటర్ కోర్స్ లేకుండా భావప్రాప్తి పొందటం చేస్తోందట. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం ఎంతో బాగుందని, తాను కొత్త ప్రపంచాన్ని చూస్తున్నానని చెబుతోంది. మరి, మెదడును కంట్రోల్ చేయటం ద్వారా భావప్రాప్తి పొందుతున్నానని చెబుతున్న ఈలా వోంక్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.