Pillow: తల కిందకు దిండు లేకపోతే కొంతమందికి నిద్ర పట్టదు. మరి కొంతమంది లావుగా ఉన్న దిండు తల కిందలేకపోతే నిద్రపోరు. ఎత్తులో తల పెట్టి పడుకుంటే ఆరోగ్యానికి మంచి కాదని చెప్పినా వినరు. ఒకటి పోతే ఇంకోటి ఇలా దిండ్లను వాడుతూ ఉంటారు. సాధారణంగా మధ్యతరగతి వాళ్లు ఉపయోగించే దిండు ఖరీదు 50నుంచి 200వరకు ఉంటుంది. డబ్బున్న వాళ్లయితే వేలు ఖర్చుపెట్టి బ్రాండెడ్ దిండ్లను ఉపయోగిస్తారు కావచ్చు. కానీ, ఎంత డబ్బున్నా లక్షలు పెట్టి దిండును కొని తల కింద పెట్టుకునే వాళ్లు ఎవరుంటారు చెప్పండి?.. ఇప్పుడు నేను చెప్పబోయే దిండును కొనటానికి మల్టీ బిలియనీర్లు కూడా ఆలోచిస్తారు. ఎందుకంటే దాని ఖరీదు మామూలుగా లేదు. ఒకటి కాదు.. రెండు కాదు.. దాదాపు.. ఇంతకీ ఆ దిండు సంగతేంటో మీరే చదవేయండి..
నెదర్లాండ్‌కు చెందిన తిజ్స్ వాన్‌డెర్ హిల్ట్స్ అనే వ్యక్తి ‘ తైలోర్‌మేడ్ పిల్లో’ పేరిట ఓ దిండును తయారు చేశాడు. ఆ దిండు స్పెషాలిటీ ఏంటంటే.. దాన్ని ఈజిప్షియన్ పత్తి, మల్బరీ సిల్క్, విషపదార్థాలు లేని డచ్ మెమొరీ ఫామ్‌తో తయారు చేశాడు. దిండు కోసం వాడిన దూది మొత్తం రొబోటిక్ మిల్లింగ్ మిషిన్ ద్వారా తయారు చేశాడు. అంతేకాదు! దిండు డిజైన్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారాన్ని, వజ్రాలను ఉపయోగించాడు. ప్రైజ్ ట్యాగ్‌లో కూడా 22.5 క్యారెట్ల నీలం రంగు రత్నం, నాలుగు వజ్రాలు పొదిగాడు.
దీన్ని తయారు చేయటానికి తిజ్స్ వాన్‌డెర్ హిల్ట్స్ 15 సంవత్సరాలు కష్టపడ్డాడు. ఇక, ఈ దిండు వల్ల లాభం ఏంటంటే.. దిండుపైన తొడిగిన గుడ్డ ఎలక్ట్రోమ్యాగ్నటిక్ రేడియేషన్‌ను నిలువరించి మంచి నిద్ర పట్టేలా చేస్తుంది. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న దీని ధర 57వేల డాలర్లు. అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపు 45 లక్షల రూపాయలు. ఇంత డబ్బులు పెట్టి ఈ దిండును ఎవరు కొంటారో చూడాలి. మరి, ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఈ దిండుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : వీడియో: లైవ్ లో యాక్సిడెంట్! తర్వాత ఆ వ్యక్తి చేసిన పనికి ఫ్యూజులు ఔట్!