కోర్టులో కేసు వాదించాలంటే లాయర్ తప్పనిసరి. జడ్జి కూడా బోన్ లో నిలబడ్డ వ్యక్తిని మీ తరపున వాదించడానికి లాయర్ ఎవరైనా ఉన్నారా? అని అడుగుతారు. స్థోమత లేని వాళ్ళు లాయర్ ని పెట్టుకోలేని నిస్సహాయతను జడ్జి ముందు వ్యక్తపరుస్తారు. లాయర్ ని పెట్టుకోవాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి అని అంటారు. ఏదైనా కేసులో ఇరుక్కుని.. తన తప్పు లేదని నిరూపించుకోవడానికి కూడా డబ్బు ఉండాల్సిన సమాజం ఇది. డబ్బుతోనే పనులు జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో డబ్బున్న వాడిదే గెలుపు, మరి సామాన్యుల పరిస్థితి ఏంటి? అని ఒక వ్యక్తి ఆలోచన నుంచి పుట్టుకొచ్చిందే ఈ రోబో లాయర్. ఇకపై డబ్బులు లేక ఏ ఒక్కరూ అన్యాయం అయిపోకూడదు అన్న సంకల్పంతో ఒక వ్యక్తి సరికొత్త ఆలోచనకు నాంది పలికారు.
తమ తరపున వాదించే లాయర్ లేక.. తమ తప్పు లేదని నిరూపించుకునే అవకాశం లేక చాలామంది జీవితాలు అన్యాయం అయిపోతున్నాయి. ఈ పరిస్థితి ఎవరికీ రాకూడదని ఒక వ్యక్తి ఉచితంగా వాదించే రోబోను అందుబాటులోకి తీసుకొచ్చారు. అతను మరెవరో కాదు అమెరికాకు చెందిన జాషువా బ్రౌడర్ అనే శాస్త్రవేత్త. ప్రపంచంలోనే తొలి రోబో లాయర్ ని సృష్టించి అరుదైన రికార్డు సాధించారు. నింద మోపబడిన నిందితుల తరపున కోర్టులో వాదించేందుకు ఒక ఆర్టిఫిషియల్ రోబోని కనిపెట్టారు. డు నాట్ పే యాప్ ద్వారా ఎటువంటి ఫీజులు చెల్లించే పని లేకుండా ఉచితంగా లాయర్ సేవలను అందించనున్నారు. ఈ యాప్ ద్వారా జడ్జి ఎయిర్ పాడ్స్ ద్వారా రోబో వాదనలు విని.. దానికి తగ్గట్టు తీర్పుని వెల్లడిస్తారు.
దీని వల్ల కోర్టు సమయం, కోర్టు ఖర్చులు కూడా తగ్గుతాయని జాషువా వెల్లడించారు. డు నాట్ పే అనేది మొబైల్ అప్లికేషన్.. ఇది ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ ద్వారా లీగల్ సర్వీసులను అందిస్తుంది. 2015లో బేసిక్ చాట్బాట్ గా ప్రారంభమైంది. యూజర్లకి మధ్యవర్తుల ద్వారా సలహాలు ఇచ్చేలా రూపొందించబడింది. ఇప్పుడు అది కోర్టులో వాదనలు వినిపించే రోబోగా రూపాంతరం చెందింది. అమెరికాలోని మున్సిపల్ ట్రాఫిక్ కోర్టులో డు నాట్ పే యాప్ ద్వారా రోబో లాయర్ అప్ కమింగ్ కేసులను వాదించనున్నట్టు జాషువా తెలిపారు. ఈ యాప్ లో కార్పొరేషన్లలో పోరాడేందుకు, బ్యూరోక్రసీని ఎదిరించడానికి, అవినీతి సొమ్ముని కనుగొనడానికి, పరువు నష్టం దావా వేయడానికి వంటి లీగల్ సర్వీసులను ఉచితంగా అందించనున్నట్లు కంపెనీ వెబ్ సైట్ లో వెల్లడించారు.
DoNotPay will pay any lawyer or person $1,000,000 with an upcoming case in front of the United States Supreme Court to wear AirPods and let our robot lawyer argue the case by repeating exactly what it says. (1/2)
— Joshua Browder (@jbrowder1) January 9, 2023
లాయర్ ని పెట్టుకునే స్థోమత లేని వారికి ఉచితంగా వాదిస్తామని, భారీగా ఫీజులు వసూలు చేసే లాయర్ల కంటే తక్కువ ఖర్చుతో వాదనలు కోర్టుకి వినిపిస్తామని డు నాట్ పే ఫౌండర్ జాషువా వెల్లడించారు. అలానే చట్టాల్లోని లొసుగులను అడ్డుపెట్టుకుని వాస్తవాలను వక్రీకరించే వారికి చెక్ పెట్టేందుకు ఈ రోబో లాయర్ ఉపయోగపడుతుందని జాషువా వెల్లడించారు. మరి చట్టాన్ని అడ్డుపెట్టుకుని తప్పుడు పనులకు పాల్పడుతున్న లాయర్లకు చెక్ పెట్టేందుకు జాషువా తీసుకొచ్చిన ప్రపంచపు మొట్టమొదటి రోబో లాయర్ పై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.