మీరు కాస్ట్లీ కార్లు చూసుంటారు, బైక్ లు చూసుంటారు, ఖరీదైన దుస్తులు కూడా చూసుంటారు. కానీ, కాస్ట్లీ ఐస్ క్రీమ్ చూశారా? లక్షల విలువజేసే ఐస్ క్రీమ్ ఒక టుందని మీకు తెలుసా? అవునండి.. ఒక ఐస్ క్రీమ్ ధరతో మీరు కారు కొనేయచ్చు. మరి.. దాని వివరాలేంటి? ఎందుంకత ప్రత్యేకమో? చూసేయండి.
మనం నిత్య జీవితంలో ప్రత్యక్షంగా, సోషల్ మీడియాలో, సెలబ్రిటీల ప్రొఫైల్స్ లో ఎన్నో ఖరీదైన వస్తువులు చూస్తుంటాం. సూపర్ లగ్జరీ కార్లు, ఖరీదైన దుస్తులు, కోట్ల విలువజేసే వాచ్లు, ఖరీదైన బూట్లు చూసుంటారు. కానీ, ఎప్పుడైనా లక్షలు విలువజేసే ఐస్ క్రీమ్ చూశారా? ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆ ఐస్ క్రీమ్ గురించే చర్చ జరుగుతోంది. ఈ ఐస్ క్రీమ్ ఖరీదుగా ఉండమే కాదు.. గిన్నిస్ బుక్ లో స్థానం కూడా దక్కించుకుంది. అసలు ఆ ఐస్ క్రీమ్ ఎందుకు అంత ఖరీదు? దాని టేస్ట్ ఎలా ఉంటుంది? ఎందుకు బంగారం కంటే కూడా కాస్ట్లీగా ఉంది? అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో బాగా వినిపిస్తున్నాయి. వాటికి సమాధానాలు చూసేయండి.
ఈ ఖరీదైన ఐస్ క్రీమ్ ని జపాన్ కు చెందిన సిలాటో అనే ఐస్ క్రీమ్ సంస్థ తయారు చేస్తోంది. ఈ రకం ఐస్ క్రీమ్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఐస్ క్రీమ్ గా రికార్డులు సృష్టించింది. ఇందులో బైకుయా అనే ప్రొటీన్ ఉండటం విశేషం. అయితే ఇంత ఖరీదైన ఐస్ క్రీమ్ ని బంగారం తయారు చేస్తారా? అని అనుకోకండి ఈ ఐస్ క్రీమ్ ని కూడా పాలతోనే తయారు చేస్తారు. పాలతో పాటుగా.. ఎగ్ యాక్, ఛీజ్, వైట్ ట్రఫుల్, గోల్డ్ లీఫ్, ట్రఫుల్ ఆయిల్ ని ఉపయోగిస్తారు. ఈ ఐస్ క్రీమ్ మాత్రమే కాదండోయ్.. అది తినడానికి ఇచ్చే స్పూన్ కూడా ఎంతో ప్రత్యేకం. దానిని టోక్యోకి చెందిన హస్త కళాకారులు తయారు చేస్తారు. దానిని కేవలం చేతులతో మాత్రమే తయారు చేస్తారు.
అందుకే ఐస్ క్రీమ్ మాత్రమే కాదు.. ఆ స్పూన్ కూడా ప్రత్యేకం. దీని క్వాటింటీ కేవలం 130 ఎంఎల్ మాత్రమే అనే విషయం కాస్త నిరూత్సాహ పరచచ్చు. దీని ప్యాకింగ్ కూడా ఎంతో స్టైలిష్ గా ఉంటుంది. ఈ ఐస్ క్రీమ్ ఒక బ్లాక్ బాక్సులో వస్తుంది. ఇంక దీని ధర విషయానికి వస్తే.. ఇది 8,80,000 యెన్స్ అనమాట. అంటే మన కరెన్సీలో అక్షరాలా రూ.5 లక్షల కంటే ఎక్కువే. మీరు ఈ ఐస్ క్రీమ్ ఆర్డర్ చేస్తే.. దానిని తినేందుకు ఇంత టైమ్ పిరియడ్ అని ఏమీ ఉండదు. మీ 130 ఎంఎల్ క్వాంటిటీ ఐస్ క్రీమ్ అయిపోయేంత వరకు చక్కగా ఆశ్వాదిస్తూ తినచ్చు. రుచి సంగతి పక్కన పెడితే.. ధర వల్లే ఈ ఐస్ క్రీమ్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించింది.
The Guinness World of Records awarded Byakuya as the world’s most expensive ice cream on April 25, and it costs ¥880,000 or around P328,000 for a 130ml serving.
READ: https://t.co/oeIEFdNXv3 pic.twitter.com/pjCTvRG5j2
— PhilSTAR L!fe (@philstarlife) May 7, 2023