సాధారణంగా ప్రతి ఉద్యోగికి తమ కంపెనీలు బోనస్ లు ప్రకటిస్తుంటాయి. అయితే సంస్థను బట్టి బోనస్ లు ఉంటాయి. మనం ఏ ఉద్యోగినైనా ..నీ బోనస్ ఎంతా? అని అడిగితే అందరూ చెప్పే సమాధానం.. ఓ వెయ్యి, లేదా రూ. 1500.. మహా అయితే రూ. 2500 అని చెబుతారు. అయితే ఓ లేడీ బాస్ మాత్రం బోనస్‌గా తన ఉద్యోగులకు ఏం ఇచ్చిందో తెలిస్తే మీరు షాక్ అవ్వడం ఖాయం. ఆ బాస్ తన కంపెనీ 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని.. మిలియన్ డాలర్ల ఆదాయం దూసుకుపోతున్న సందర్భంగా.. తన సంస్ధలోని ఉద్యోగులను సర్ప్రైజ్ చేస్తూ అదిరిపోయే బోనస్ ప్రకటించింది. ఆమె ప్రకటించిన బోనస్ తెలుసుకుని.. అందరూ “ఈ బాస్ దేవత రా! సామీ” భూమిద ఉన్న బాస్ లో నువ్వే బెస్ట్ “అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే..
అమెరికాలోని స్పాన్ ఎక్స్ అనే కంపెనీ యాజమాని సారా బ్లేక్లీ. ఆమె కంపెనీ ఇటీవల 21వ వార్షికోత్సవం ఘనంగా జరుపుకుంది. ఈ సందర్భంగా ఉద్యోగులకు బోనస్ ప్రకటించింది.సారా బ్లేక్లి.. తన సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు బోనస్ కింద 10,000 డాలర్లు అంటే భారత కరెన్సీలో రూ.8 లక్షలు. వాటితో పాటు విహార యాత్ర చేసేందుకు రెండు ఫస్ట్ క్లాస్ విమాన టికెట్లను ప్రకటించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ….”నేను మొదటిగా ఈ కంపెనీని స్థాపించాలనుకున్నప్పుడు ప్రతీ ఒక్కరూ నవ్వారు. అయినా నాపై నేను నమ్మకం ఉంచాను. ఎంతోమంది మహిళా వ్యవస్థాపకులను ఆదర్శంగా తీసుకుని ఒక్కో అడుగుకు ముందుకేసి.. ఈ స్థాయికి చేరుకున్నాను.
ఇప్పుడు నా విజయాన్ని ఎంజాయ్ చేసేందుకు ప్రపంచ మొత్తం తిరుగుతున్నాను.. మీరు వెళ్లాలని మీకు ఫస్ట్ క్లాస్ టికెట్లు కొన్నాను. మీకు తెలుసా, మీరు ఓ ఎక్కడికైన ఓ ట్రిప్ వేయాలన్న.. మంచి డిన్నర్‌కి వెళ్ళాలన్నా.. మంచి హోటల్‌కి వెళ్లాలని అనుకున్నా దాని ఎంతగానో ఖర్చు అవుతుంది. అందుకే మీ అందరికీ రెండు ఫస్ట్-క్లాస్ టిక్కెట్లతో పాటు 10 వేల డాలర్లు ఇస్తున్నాను. ప్రపంచంలో ఎక్కడికైనా తిరిగి రండి” అంటూ సారా తన ఇన్‌స్టాలో ఓ వీడియోను పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమెపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. మరి… అదిరిపోయే బోనస్ ప్రకటించిన ఈ లేడి బాస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.