74 రోజులుగా నీళ్లలో ఉంటున్న కారణంగా ఆయన పేరున వరల్డ్ రికార్డ్ క్రియేట్ అయింది. ప్రపంచ వ్యాప్తంగా జోషఫ్ డిటురీస్ స్టోరీ వైరల్‌గా మారింది. ఆయన 100 రోజులు నీళ్లలోనే ఉంటానని అంటున్నాడు.
మహా భారతంలోని జరాసంధుడి పాత్ర గురించి మీకు తెలిసే ఉంటుంది. జరాసంధుడికి ‘జలస్తంభన’ విద్య తెలుసు. ఆయన నీళ్లలో ఊపిరి తీసుకోకుండా.. కొన్ని గంటల పాటు ఉండగలడు. ఇది మహా భారత కాలం నాటి విషయం. ప్రస్తుత సమాజంలో ఇలా నీళ్లలో గంటలు, గంటలు ఉండటం ఎవరి వల్లా కాదు. కానీ, ఓ వ్యక్తి ఏకంగా 74 రోజుల పాటు నీళ్లలోనే ఉండిపోయాడు. ఇలా ఏకధాటిగా ఇన్ని రోజులు నీళ్లలో ఉండి.. వరల్డ్ రికార్డు సాధించాడు. అయితే, ఈ 74 రోజులు నీళ్లలో ఉండటానికి ఆయన ఓ ప్రత్యేక ఏర్పాట్లు చేసుకున్నాడు. ఆ పూర్తి వివరాల్లోకి వెళితే.. ఫ్లోరిడాకు చెందిన జోషఫ్ డిటురీస్ అనే వ్యక్తి ఫ్లోరిడా యూనివర్శిటీలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్నాడు. ఈయనకు నీళ్లలో ఎక్కువ రోజులు గడపాలన్న కోరిక పుట్టింది.
అది కూడా ఎక్కువ రోజులు నీళ్లలో ఉండి రికార్డు క్రియేట్ చేయాలని భావించాడు. ఇందుకోసం ఓ ప్రత్యేక ప్లాన్‌ను సిద్ధం చేసుకున్నాడు. ఫ్లోరిడాలోని కీ లార్గోలోని నీళ్లలో ఓ 30 అడుగుల గదిని నిర్మించుకున్నాడు. ఆ గదిలోనే నివసిస్తున్నాడు. ఆయన నీళ్లలోకి దిగి ఇప్పటివరకు 74 రోజులు గడిచింది. 74 రోజులుగా నీళ్లలో ఉంటున్న కారణంగా ఆయన పేరున ఓ ప్రపంచ రికార్డ్ క్రియేట్ అయింది. ఆయన నీటిలో ఆ గదిలోనే అన్ని పనులు చేసుకుంటున్నాడు. ఖాళీగా ఉండకుండా లోపలినుంచే 2,500 మంది విద్యార్ధులకు మెరైన్ సైన్స్ గురించి క్లాసులు తీసుకుంటున్నాడు. 100 రోజుల పాటు నీళ్లలోనే ఉండాలని ఆయన భావిస్తున్నాడు.
జూన్ 9 వరకు ఆయన నీళ్లలోనే ఉండనున్నాడు. దీనిపై జోషఫ్ డిటురీస్ ట్వీట్ ద్వారా స్పందిస్తూ.. ‘‘ ఏదైనా కనిపెట్టాలన్న ఆలోచన నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. భావి తరాలకు స్పూర్తిగా నిలవాలన్నది నా ఆలోచన. నీళ్లలో మనిషి జీవితం ఎలా ఉంటుంది. విపత్కర పరిస్థితుల్లో ఎలా స్పందించాలి వంటి వాటిని తెలుసుకోవటమే లక్ష్యం’’ అని పేర్కొన్నాడు. కాగా, నీటిలో జోషఫ్‌లాగా ఎక్కువ రోజులు ఉండటం చాలా కష్టం. ఎందుకంటే లోపల ఓ రకమైన ఒత్తిడి ఉంటుంది. దాన్ని తట్టుకుని నిలబడ్దం అందరి వల్లా కాదు. మరి, 74 రోజులుగా నీటిలో ఉంటున్న జోషఫ్ డిటురీస్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.